అందాల షెఫాలీ బగ్గా.. 

చెన్నైలో జరిగిన ipl 2024 ప్రారంభోత్సవంలో గుక్క తిప్పుకోకుండా గడగడా మాట్లాడేసి అందరి దృష్టినీ ఆకర్షించింది షెఫాలీ బగ్గా.

షెఫాలీ దిల్లీలో పుట్టింది. జర్నలిజం మీద ఆసక్తితో డిగ్రీ పూర్తి చేసింది. కొద్ది రోజులు రిపోర్టర్‌గానూ పని చేసింది. 

క్లీన్‌ అండ్‌ క్లియర్‌ ఫ్రెష్‌ ఫేస్‌ కాంటెస్ట్‌(2012)లో టాప్‌ 10లో నిలిచింది. ఆ తర్వాత టీవీ యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది. 

హిందీ బిగ్‌బాస్‌ (2019)లో పాల్గొని ఫేమసయ్యింది. ఆ తర్వాత ఐపీఎల్‌కు హోస్ట్‌గా వ్యవహరించే అవకాశమొచ్చింది. 

సొంత యూట్యూబ్‌ ఛానలూ ఉంది. ఫ్యాషన్‌, ట్రావెల్‌, లైఫ్‌స్టైల్‌ వీడియోలు చేస్తుంటుంది.

రణ్‌వీర్‌ సింగ్‌కి వీరాభిమాని. ఆయన సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్‌ కొట్టవంటోంది.

 క్రికెటర్లలో రిషభ్‌ పంత్‌, విరాట్‌ కోహ్లీ అంటే ఇష్టపడుతుంది.

గ్రౌండ్‌లో క్రికెటర్లతో షెఫాలీ చేసే హంగామా అంతా ఇంతా కాదు. నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుంది.

This browser does not support the video element.

ఈమెకి భక్తి కూడా ఎక్కువే. కుటుంబంతో కలసి తరచూ తీర్థయాత్రలకు వెళ్తుంది.

గ్లామర్‌ ఒలకబోస్తూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫొటోలకు లైకుల వర్షం కురుస్తుంటుంది. తన ఇన్‌స్టా ఖాతాకి 20 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు.

This browser does not support the video element.

షెఫాలీకి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఎక్కువే. కఠినమైన డైట్‌ ఫాలో అవుతూ రోజులో ఎక్కువ సమయం జిమ్‌లోనే గడిపేస్తుందట. ఖాళీ సమయాల్లో డ్యాన్స్‌ చేస్తుంది. 

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు

టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు (10-07-2024)

ముంబయి తీరంలో టీమిండియా సంబరాలు..

Eenadu.net Home