మైక్‌ పట్టిన బ్యూటిఫుల్‌ బ్యాటర్‌

ఐపీఎల్‌ ‘మ్యాచ్‌ సెంటర్‌ తెలుగు’లో మరో మహిళా వ్యాఖ్యాత సందడి చేస్తున్నారు. తను ఎవరో కాదు.. మాజీ క్రికెటర్‌, తెలుగుమ్మాయి సునీతా ఆనంద్‌.

Image: Instagram/Sunitha Anand

మ్యాచ్‌కు సంబంధించిన అంశాల గురించి విశ్లేషిస్తూ.. తోటి క్రికెటర్లతో ఈమె సంభాషణ వీక్షకులను ఆకట్టుకుంటోంది. 

Image: Instagram/Sunitha Anand

ఇటీవల జరిగిన ‘వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌’లోనూ సునీత వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 

Image: Instagram/Sunitha Anand

ఆంధ్రప్రదేశ్‌లోని రాజోలులో జన్మించిన సునీతకు మొదట్లో క్రికెట్‌ అంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదట.

Image: Instagram/Sunitha Anand

పద్నాలుగేళ్ల వయసులో తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌లో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు. క్రమంగా క్రికెట్‌పై తనకూ ఆసక్తి పెరిగింది.

Image: Instagram/Sunitha Anand

సునీత చిన్నవయసులోనే తండ్రి ప్రమాదంలో మరణించారు. ఆయన ఆశయం మేరకు క్రికెట్‌లో రాణించాలని సంకల్పించుకున్నారు. 

Image: Instagram/Sunitha Anand

అలా క్రికెట్‌లో మెరుగైన శిక్షణకోసం రాజోలు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సునీతకు.. స్టార్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్ తండ్రి బాసటగా నిలిచారు.

Image: Instagram/Sunitha Anand

చదువుకుంటూ, పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ క్రికెట్‌లో శిక్షణ పొందారు. వికెట్‌కీపర్‌/బ్యాటర్‌గా దేశీయ క్రికెట్‌లో చోటు సంపాదించి అద్భుత ప్రదర్శనతో మెప్పించారు. 

Image: Instagram/Sunitha Anand

అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం సునీతకు తగిన స్థానం దక్కలేదు. తన కెరీర్‌లో థాయిలాండ్‌, హాంకాంగ్‌తో రెండు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. ఇంగ్లాండ్‌ అకాడమీ వుమెన్స్‌తో తలపడ్డారు. 

Image: Instagram/Sunitha Anand

ప్రస్తుతం సునీత.. యోగా శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ సందడి చేస్తున్నారు.

Image: Instagram/Sunitha Anand

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home