ఐపీఎల్ పుత్తడి బొమ్మ.. పూర్వీ భావే!
ఐపీఎల్‌లో ఆటతోపాటు అందాలూ అలరిస్తున్నాయి. జియో సినిమా ఐపీఎల్ ‘మ్యాచ్ సెంటర్’ తెలుగులో ప్రత్యూష సాధు మెప్పిస్తున్నట్లే.. మరాఠీలో పూర్వీ భావే ఆకట్టుకుంటోంది.
Image: Instagram/Poorvi Bhave
పూర్వీ.. బుల్లితెర యాంకర్, నటి. మరాఠీ టీవీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Image: Instagram/Poorvi Bhave
ఈ భామది ముంబయి. చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి. ఐదో తరగతి చదువుతున్న సమయంలోనే స్టేజీ నాటకాల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. పలు సీరియళ్లలో బాలనటిగానూ మెప్పించింది.
Image: Instagram/Poorvi Bhave
ఎనిమిదేళ్ల వయసు నుంచే భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. జాతీయ స్థాయిలో పలు నృత్యపోటీల్లో పాల్గొంది.
Image: Instagram/Poorvi Bhave
చదువు పూర్తి కాగానే యాంకర్‌గానే కెరీర్ ప్రారంభించింది. స్టార్ మాలో దాదాపు రెండేళ్లు యాంకర్‌గా పనిచేసింది. ఉత్తమ యాంకర్‌గా అవార్డు గెలుచుకుంది.
Image: Instagram/Poorvi Bhave
ఈ 37 ఏళ్ల యాంకర్‌కు యాంకరింగ్‌లో సుదీర్ఘ అనుభవం ఉంది. అందుకే, ఐపీఎల్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశమొచ్చింది.
Image: Instagram/Poorvi Bhave
ఐపీఎల్ మ్యాచ్ సెంటర్‌లో పూర్వీ అందంతోపాటు చలాకీతనం.. క్రికెట్‌పై ఆమెకున్న అభిరుచి చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
Image: Instagram/Poorvi Bhave
యాంకరింగ్ కంటే.. పూర్వీకి భరతనాట్యంపైనే మక్కువ. ఇప్పటికీ ఈమెకు నృత్యానికి సంబంధించిన పలు సంస్థల నుంచి స్కాలర్‌షిప్స్ వస్తుంటాయి.
Image: Instagram/Poorvi Bhave
అనేక మంది విద్యార్థులకు భరతనాట్యం పాఠాలు నేర్పిస్తోంది. వీలైతే.. నృత్యపోటీల్లో పాల్గొనేందుకూ సిద్ధంగా ఉంటుందట.
Image: Instagram/Poorvi Bhave