జమల జమాలో.. ఈ బ్యూటీ మాయలో!

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘యానిమల్’. ఇందులో నటించిన వారందరికీ మంచి గుర్తింపు దక్కింది. కొన్ని సెకన్లపాటు కనిపించిన ‘జమాల కుదూ’ బ్యూటీకి కూడా.

This browser does not support the video element.

బాబీ దేవోల్‌ వివాహం సీన్‌లో ‘జమాల కుదూ..’ అంటూ పాట పాడుతూ మెరిసింది.. తనాజ్‌ దావూడి. క్యూట్‌గా ఉండటంతో ఈమె కోసం గూగుల్లో తెగ వెతికారు. సోషల్‌ మీడియాలోనూ బాగా పాపులరైంది. 

ఈమె 1997లో ఇరాన్‌లో జన్మించింది. తండ్రి జర్నలిస్టు. తనాజ్‌ 2014 - 2017 మధ్య ఫ్యాషన్‌ డిజైనింగ్‌ పూర్తి చేసి మోడల్‌గా కెరియర్‌ మొదలు పెట్టింది. 

డ్యాన్స్‌ అంటే మక్కువ. అందుకే, భారత్‌కు వచ్చి బాలీవుడ్‌లో డ్యాన్సర్‌గా మారిపోయింది. పలు హిందీ సినిమా, ప్రైవేట్‌ పాటల్లో డ్యాన్సర్‌గా కనిపించింది. స్టేజీ షోస్‌, డ్యాన్స్‌ ప్రోగ్రామ్స్‌లోనూ పాల్గొంది.  

నోరా ఫతేహి, వరుణ్‌ ధావన్‌, జాన్‌ అబ్రహం , సన్నీ లియోన్‌ వంటి ప్రముఖులతో కలిసి పలు పాటల్లో స్టెప్పులేసింది. చాలా కాలంగా, ఇండస్ట్రీలో ఉన్నా పెద్దగా గుర్తింపు రాలేదు.

This browser does not support the video element.

తాజాగా ‘యానిమల్‌’ పాటతో ఈమె జీవితమే మలుపు తిరిగింది. ఓవర్‌నైట్‌ సెలబ్రిటీగా మారడమే కాదు.. యూత్‌లో క్రేజ్‌ సంపాదించింది. సినిమా విడుదలకు ముందు తనాజ్‌ ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 10,000 ఉండగా, ప్రస్తుతం అది 2.9 లక్షలకు చేరుకుంది.

ఈ భామ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌. తరచూ ఫొటోలు, ఇన్‌స్టా స్టోరీలు, రీల్స్‌ షేర్‌ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది. 

ప్రకృతి అందాలను వీక్షించడం అంటే తనకి ఎంతో ఇష్టం. అందులోనూ ఎక్కువగా బీచ్‌ల్లో గడపడమంటే ఈమెకు మహా సరదా. 

వివిధ రకాల దుస్తులు, మేకప్‌తో ఫొటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 

Images: Instagram/tanaz davoodi

ప్రీ సేల్స్‌.. ‘పుష్ప’ టాప్‌.. ‘కల్కి’?

నెం.1 పుష్ప2.. టాప్‌-10 చిత్రాలివే!

శ్రీవల్లి క్రేజీ శారీ లుక్స్

Eenadu.net Home