వీలైతే ట్రెండ్‌ని సెట్‌ చెయ్యండి..!

గతేడాది ‘నరకాసుర’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగీర్తన విపిన్‌.. ‘జనక అయితే గనక’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

సుహాస్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రానికి సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించారు. ఈ మూవీ సెప్టెంబరు 7న విడుదల కానుంది.

ఇక సంగీర్తన విషయానికొస్తే.. 2002లో కేరళలో పుట్టింది. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చదువుతోంది. 

ఓ పక్క చదువుకుంటూనే.. నటిగా రాణిస్తోంది. స్టడీకి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో.. సినీ కెరీర్‌కు కూడా అంతే ఇంపార్టెన్స్‌ ఇస్తుంది.

టీనేజ్‌లోనే మోడలింగ్‌తో కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. 

మలయాళంలో ‘హైగుటా’తో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తెలుగులో ‘నరకాసుర’, ‘ఆపరేషన్‌ రావణ్’, ‘అసురగణ రుద్ర’, తమిళంలో ‘కాడువెట్టి’తో అలరించింది.

‘ఫ్యాషన్‌ అనేది మన గురించి తెలియజేస్తుంది. ఎలాంటి దుస్తులు ధరించినా.. ధైర్యంగా ముందుకు సాగాలి. మీదైన స్టైల్‌లో ట్రెండ్‌ని సృష్టించండి’ అంటూ యువతరం అమ్మాయిలకు సలహా ఇస్తోంది సంగీర్తన. 

ఈమె డ్రెస్‌ కలెక్షన్‌లో ఇష్టమైనవి ఏవంటే... ‘చీరకే మొదటి ప్రాధాన్యం ఇస్తా’నంటోంది. ఇన్‌స్టాలోనూ చీరలో ఉన్న ఫొటోలే ఎక్కువగా ఉంటాయి.

‘జీవితం అనేది కెమెరా లాంటిది. మంచి విషయాల మీద శ్రద్ధ పెట్టండి. చెడు విషయాల నుంచి నేర్చుకోండి. చేసే పనిలో విజయం అందకపోతే ఇంకో షాట్‌ తీసుకొని ప్రయత్నించండి’ అంటోందీ బ్యూటీ.

ప్రకృతిలో విహరించడం ఈమెకి బాగా నచ్చుతుంది. అప్పుడప్పుడు మంచు ప్రదేశాలకు ట్రిప్‌లు ప్లాన్‌ చేస్తుంటుంది.

మగవాడు అంటేనే పగవాడు అంటోన్న రీతూ..

విమానాల హైజాక్‌.. ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావద్దు

నెట్టింట కొత్త పోస్టర్ల సందడి..

Eenadu.net Home