జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

ఎన్టీఆర్, జాన్వీ జంటగా నటిస్తున్న ‘దేవర’ నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల అయ్యాయి. రావడం.. రావడం వైరల్‌గా మారాయి.

డ్యూయట్‌ సాంగ్స్‌లో ఎన్టీఆర్‌తో కలసి జాన్వీ చేసిన డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు.

యూట్యూబ్‌లో ఎక్కువమంది చూసిన టాప్‌ 25 వీడియోల్లో ‘దావూదీ...’ తొలి స్థానంలో ఉండగా.. ‘చుట్టమల్లే...’ 18వ స్థానంలో నిలిచి రికార్డులు బద్దలుకొట్టాయి. 

‘దేవర’లో జాన్వీ ‘తంగం’ పాత్రలో అలరించనుంది. ట్రైలర్‌లో లంగావోణీల్లో కనిపించి మురిపించిన జాన్వీ.. పాటల్లో ట్రెండీ దుస్తుల్లో కనిపించింది.

మిగిలిన సినిమాల సంగతి చూస్తే.. బాలీవుడ్‌లో ‘సన్నీ సంస్కారీ కి తులసీ కుమారీ’లో వరుణ్‌ ధావన్‌తో కలసి నటిస్తోంది.

రామ్‌చరణ్‌ #16కి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీనే కథానాయిక. 

 శ్రీదేవి ప్రతి పుట్టిన రోజున జాన్వీ తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటుంది. ‘ఇలా చేయడం వల్ల అమ్మ నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది’ అని చెబుతోంది.

జాన్వీకి అద్భుతమైన టాలెంట్, జ్ఞాపకశక్తి ఉన్నాయి. ముంబయి నుంచి వచ్చారు తెలుగులో డైలాగ్స్‌ ఏం చెప్తారు అనుకున్నా.. కానీ డైలాగ్‌ డెలివరీ చూసి షాకయ్యాను అని ఎన్టీఆర్‌ మెచ్చుకున్నారు.

‘దేవర’ ప్రమోషన్స్‌లో భాగంగా జాన్వీ కూడా శ్రీదేవి లానే తమిళంలో అనర్గళంగా మాట్లాడింది. ఇది చూసి ఈమె ఫ్యాన్స్‌ నెట్టింట ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

నిమ్రత్‌ @ 8.. రూమర్స్‌తో ట్రెండింగ్‌లోకి!

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

Eenadu.net Home