జాణవులే నెర ‘జాన్వి’విలే

సోషల్‌ మీడియాలో జాన్వీ క్రేజ్‌ మామూలుగా ఉండదు. ఆమె ఏ ఫొటో పెట్టినా... నెటిజన్లు లైక్‌లు కొట్టేస్తుంటారు. 

This browser does not support the video element.

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వేడుకల్లో జాన్వీ డ్యాన్స్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

 దుస్తులు, యాక్సెసరీలతో ట్రెండ్‌ సృష్టించే ఈ భామ ‘2023 బాలీవుడ్‌ హంగామా స్టైలిష్‌ యూత్‌ ఐకాన్‌’, ‘2023 పింక్‌ విల్లా’ అవార్డులను గెలుచుకుంది.

జాన్వీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌. తన రోజుని ఎక్సర్‌సైజ్‌తోనే ప్రారంభిస్తుంది. వెయిట్‌ లిఫ్టింగ్‌, సైక్లింగ్‌, పుష్‌ అప్స్‌, డ్యాన్స్‌ చేస్తుంది.

గ్లుటెన్‌ ఫ్రీ ఆహారానికే ప్రాధాన్యం చూపిస్తుంది. కాలానుగుణంగా వచ్చే పండ్లు, తాజా కూరగాయలను తీసుకుంటుంది. 

తెలుగు వారి పండుగలను సెలబ్రేట్‌ చేసుకోవడం అంటే ఇష్టం. చీరకట్టు తన ఫేవరెట్‌.

‘‘నన్ను డాక్టర్‌గా చూడాలని అమ్మకు చిన్నప్పట్నుంచీ కోరిక. నేను యాక్టర్‌ అవుతానంటే ఒప్పుకోలేదు. నాన్నే అమ్మకు నచ్చజెప్పారు’’ అని తల్లి శ్రీదేవి గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

ఖాళీ సమయం దొరికితే కవితలు రాస్తుందట. క్లాసికల్‌ డ్యాన్స్‌ అంటే ఇష్టం. పెయింటింగ్‌ కూడా చేస్తుంది.

పెళ్లి సమయంలో కాంజీవరం జరీ చీర కట్టుకోవాలనేది ఆమె కోరిక. అంతేకాదు ‘పెళ్లి ఎప్పుడు చేసుకున్నా అది తిరుపతిలోనే’ అని తేల్చి చెప్పేసింది. 

బాలీవుడ్‌ అగ్ర నాయికల్లో ఒకరు జాన్వీ కపూర్‌. చాలా ఏళ్లుగా ఆమె ఎదురుచూస్తున్న టాలీవుడ్‌ ఎంట్రీ ఎన్టీఆర్‌ ‘దేవర’తో నెరవేరనుంది. 

‘దేవర’ థియేటర్లలోకి వచ్చేలోపే ఆమె మరో తెలుగు సినిమా ఓకే చేసేసింది. రామ్‌చరణ్‌ - బుచ్చిబాబు సినిమాలో ఆమెనే కథానాయిక. 

తమిళంలోనూ ఆమె ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సూర్య సరసన ‘కర్ణ’తో కోలీవుడ్‌లోకి వస్తోందని సమాచారం. 

This browser does not support the video element.

‘బవాల్‌’తో బాలీవుడ్‌లో హిట్‌ జోడీగా నిలిచిన వరుణ్ ధావన్‌, జాన్వీ... మరోసారి ‘సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి’లో కలిసి నటిస్తున్నారు. 

ఇవి కాకుండా ‘మిస్టర్ అండ్‌ మిసెస్‌ మాహి’, ‘ఉలాజ్‌’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.

శ్రద్ధా దాస్‌... రొయ్యల కూర.. భలే కాంబో

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

Eenadu.net Home