నచ్చింది.. జెన్నీఫరూ..!

జెన్నీఫర్‌ ఇమ్మాన్యూయేల్‌... హీరో ఉదయ్‌ శంకర్‌కి జోడిగా ఆమె నటించిన ‘నచ్చింది గర్ల్‌ఫ్రెండూ’ ఇటీవల విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది.

Image: Instagram/Jenifer Emmanuel

ఈ సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతోపాటు తన అందంతో యువతనూ ఆకట్టుకుంటోంది.

Image: Instagram/Jenifer Emmanuel

This browser does not support the video element.

ఇందులో జెన్నీఫర్‌ హీరోయినే అయినా.. ప్రతినాయిక ఛాయలున్న పాత్ర. చాలా మంది నటీమణులకి ఛాలెంజింగ్‌గా అనిపించే ఆ పాత్రలో నటించి మెప్పించింది. 

Image: Instagram/Jenifer Emmanuel

ముంబయిలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో మాస్టర్స్‌ చేసింది. జర్నలిజంలో డిప్లొమా చేసి.. నటనపై ఆసక్తితో యాక్టింగ్‌ కోర్సులో చేరింది.

Image: Instagram/Jenifer Emmanuel

సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా.. టాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చిందట. నిజానికి ఆమె తెలుగులో నటించిన తొలి చిత్రం ‘బాయ్స్‌ విల్‌ బి బాయ్స్‌’. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు.

Image: Instagram/Jenifer Emmanuel

దాని కంటే ముందే తను నటించిన రెండో చిత్రం ‘నచ్చింది గర్ల్‌ఫ్రెండూ’ విడుదలైంది. ఈ సినిమా దర్శకుడు గురు పవన్‌ తనను ఫోన్‌లో ఆడిషన్‌ చూసి ఎంపిక చేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

Image: Instagram/Jenifer Emmanuel

ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో జెన్నీఫర్‌ బికినీ ధరించి మరింత హాట్‌ లుక్స్‌తో అదరగొట్టింది. బికినీ ధరించడం కోసం రెండు రోజులపాటు ప్రత్యేక ఆహార నియమాలు పాటించిందట.

Image: Instagram/Jenifer Emmanuel

జెన్నీఫర్‌ను చూసి చాలా మంది ఆమెలో తమన్నా, కృతిశెట్టి పోలికలు ఉన్నాయని అంటున్నారు. ఆ పోలిక తనకు ఆనందంగానే ఉందంటోంది.

Image: Instagram/Jenifer Emmanuel

This browser does not support the video element.

జెన్నీఫర్‌.. వెస్ట్రన్‌ డ్యాన్స్‌తోపాటు భరతనాట్యం కూడా నేర్చుకుందట. 

Image: Instagram/Jenifer Emmanuel

టాలీవుడ్‌ హీరోల్లో ఎన్టీఆర్‌, హీరోయిన్లలో సమంత తన అభిమాన నటులని, అన్ని రకాల పాత్రల్లో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. 

Image: Instagram/Jenifer Emmanuel

దేవర వీక్‌.. ఈ బ్యూటీలదే!

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

Eenadu.net Home