జెనిఫర్‌ పిచినెటో.. ఈ సారి టాలీవుడ్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై!

ఆహా ‘సిన్‌’ వెబ్‌సిరీస్‌లో నటించి తెలుగువారికి పరిచయమైన బ్రెజిలియన్‌ మోడల్‌ జెనిఫర్‌ పిచినెటో.. ఈ సారి వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతోంది. 

Image: Instagram/Jeniffer Piccinato

సత్యదేవ్‌, ధనుంజయ హీరోలుగా తెరకెక్కుతోన్న చిత్రంలో హీరోయిన్‌గా జెనిఫర్‌ను చిత్రబృందం ఎంచుకుంది.

Image: Instagram/Jeniffer Piccinato

ఇప్పటికే జెనిఫర్‌ నటించిన రెండు బాలీవుడ్‌ చిత్రాలు విడుదలై.. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.

Image: Instagram/Jeniffer Piccinato

అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘రామ్‌సేతు’లో జెనిఫర్‌ జియోలజిస్ట్‌గా నటించింది. ఇందులో సత్యదేవ్‌ కీలక పాత్ర పోషించాడు.

Image: Instagram/Jeniffer Piccinato

‘రామ్‌సేతు’ పాత్ర కోసం 10 కిలోల బరువు పెరిగిందట. హెయిర్‌స్టైల్‌ విషయంలో చాలా మార్పులు చేసుకున్నట్లు చెప్పింది జెనిఫర్‌.

Image: Instagram/Jeniffer Piccinato

తాజాగా విడుదలైన ‘థాయ్‌ మసాజ్‌’లో హాట్‌ లుక్స్‌తో అదరగొట్టింది.

Image: Instagram/Jeniffer Piccinato

బ్రెజిల్‌లో పుట్టిపెరిగిన ఈ భామ.. తొమ్మిదేళ్ల వయసు నుంచే మోడలింగ్‌ చేస్తోంది. చిన్నతనం నుంచే నటి అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుందట.

Image: Instagram/Jeniffer Piccinato

ఓవైపు మోడలింగ్‌ చేస్తూనే బ్రెజిల్‌, న్యూయార్క్‌లో నటనలో శిక్షణ తీసుకుంది. 

Image: Instagram/Jeniffer Piccinato

అనంతరం భారత్‌కు వచ్చి.. బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలోనే పలు ప్రచార చిత్రాలు, మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో నటించింది జెనిఫర్‌.

Image: Instagram/Jeniffer Piccinato

సైఫ్‌ అలీ ఖాన్‌ ‘బజార్‌’ తర్వాత తెలుగులో 2020లో ఆహాలో విడుదలైన ‘సిన్‌’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిందామె. మళ్లీ ఇప్పుడు సత్యదేవ్‌ సరసన నటించనుంది. 

Image: Instagram/Jeniffer Piccinato

ఇది వరకు సత్యదేవ్‌తో ‘రామ్‌సేతు’లో నటించడంతో.. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో సులభంగా ఉంటుందని అంటోంది. 

Image: Instagram/Jeniffer Piccinato

సినిమా కోసం ఏమైనా చేస్తానని చెబుతోంది. తనకు ఈత రాకున్నా.. ‘రామ్‌సేతు’ కోసం నేర్చుకుందట. ఇప్పుడు టాలీవుడ్‌ సినిమాల్లో నటించడానికి తెలుగు భాష కూడా నేర్చుకుంటుందట.

Image: Instagram/Jeniffer Piccinato

సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోన్న సీనియర్‌ హీరోయిన్‌!

పచ్చందనమే.. పచ్చదనమే

‘హిట్‌’ కొట్టేసిన మీనాక్షి చౌదరి!

Eenadu.net Home