కల్పనా సోరెన్‌ గురించి తెలుసా? 

ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్టుతో ఆయన సతీమణి కల్పనా సోరెన్‌ ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. ఫిబ్రవరిలో ఆమె తదుపరి సీఎం అవుతారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చినా కొత్త సీఎంగా చంపాయ్‌ సోరెన్‌ పదవీ బాధ్యతలు చేపట్టారు. 

తన భర్త జైలులో ఉండటంతో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల వేళ కల్పనా సోరెన్‌ జేఎంఎం, ‘ఇండియా’ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేస్తున్నారు.

ఇటీవల దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ఇండియా’ కూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగంతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు కల్పనా సోరెన్‌.

ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో కల్పన 1976లో జన్మించారు. తండ్రి వ్యాపారవేత్త. తల్లి గృహిణి.

ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌, బిజినెస్‌పై ఆసక్తి కారణంగా ఎంబీఏ పూర్తి చేశారు. 2006 ఫిబ్రవరి 7న హేమంత్‌ సోరెన్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. నిఖిల్‌, అన్ష్‌.  

జేఎంఎంలో ఆమెను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. ప్రస్తుతం ఆమె సేంద్రీయ వ్యవసాయం చేయడంతో పాటు ఓ పాఠశాలను నడుపుతున్నారు. మహిళలు, పిల్లల్లో సాధికారతను ప్రోత్సహించే కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు.

జీవితంలోనే కాకుండా రాజకీయాల్లోనూ హేమంత్‌కు చేదోడువాదోడుగా ఉంటూ కొన్ని ముఖ్యమైన విషయాల్లో సలహాలు కూడా ఇస్తారనే ప్రచారం ఉంది. 

దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌ సతీమణి సునీతను ఇటీవల కలిసి తన సంఘీభావాన్ని ప్రకటించారు.

‘‘ఈరోజు మా 18వ వివాహ వార్షికోత్సవం. కానీ, ప్రస్తుతం హేమంత్‌ కుటుంబంతో లేరు. అయినా నేనేమీ బాధపడట్లేదు. ఎందుకంటే నేనొక వీరుడి భార్యను. హేమంత్‌ త్వరలో ఇంటికి తిరిగి వస్తారని ఆశిస్తున్నా’’ అంటూ ఫిబ్రవరి 7న ఆమె పోస్ట్‌ పెట్టారు.

చిత్రం చెప్పే విశేషాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home