‘జో’ బ్యూటీ.. టాలీవుడ్‌ ఎంట్రీ

‘జో’ సినిమాతో సో స్వీట్‌ అనిపించుకున్న భామ మాళవికా మనోజ్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. సుహాస్‌కు జంటగా ‘ఓ భామ అయ్యో రామ’లో నటించనుంది. 

This browser does not support the video element.

ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతున్న ‘జో’ యువతను ఆకట్టుకుంటోంది. అందులో రియో రాజ్‌కు ప్రేయసిగా నటించింది మాళవిక. 

ఆ ప్రేమ కథ అర్ధంతరంగా ముగిసినా.. ఈ కేరళ కుట్టి నటనకు, సుచిత్ర పాత్రలో పండించిన భావోద్వేగాలకు యూత్‌ కనెక్ట్‌ అయ్యింది.

‘ప్రకాశన్‌ పరకట్టే’తో మలయాళంలో 2022లో ఎంట్రీ ఇచ్చింది. ‘నాయాది’, ‘జో’తో ఆకట్టుకుంది. ప్రస్తుతం మలయాళంలో ‘ఆనంద్‌ శ్రీబాల’లో నటిస్తోంది.

కేరళ కుటుంబానికి చెందిన మాళవిక చెన్నైలో పుట్టింది. ఆమె తండ్రి వ్యాపారవేత్త, తల్లి డ్యాన్సర్‌.

సౌదీ అరేబియాలోని ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ స్కూల్‌లో విద్యను పూర్తి చేసింది. చిన్నప్పట్నుంచే సంప్రదాయ నృత్యంపై ఇష్టంతో శిక్షణ తీసుకుంది.

మాళవిక నటి మాత్రమే కాదు సింగర్‌ కూడా. అంతేకాదు పాటలూ రాస్తుంది. 

This browser does not support the video element.

‘జో’ లాంటి ప్రేమకథల్లో నటించడానికి సిద్ధమే. కథ బాగుంటే పాత్ర చిన్నదైనా ఆలోచించను అంటోంది మాళవిక.

సంప్రదాయ లుక్‌ అంటే ఇష్టం. ఎక్కువగా చీరలనే ధరిస్తుంటుంది. ఇన్‌స్టాలోనూ ఆ ఫొటోలే కనిపిస్తాయి.

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

మలయాళీ బ్యూటీస్‌.. తెరపై క్యూట్‌నెస్‌

Eenadu.net Home