సౌత్‌ కుర్రాళ్ల కొత్త క్రష్‌.. భవ్య ట్రిక

ఇటీవల ఓటీటీ వేదికగా తెలుగులో విడుదలైన కోలీవుడ్‌ చిత్రం ‘జో’ సినిమా చూశారా? అందులో రెండో హీరోయిన్‌గా కనిపించి యూత్‌ను తెగ ఆకట్టుకుంది.. భవ్య ట్రిక.

‘జో’ తర్వాత సోషల్‌మీడియాలో ఈమె ఖాతాలకు ఫాలోవర్స్‌ విపరీతంగా పెరిగారు. అంతేకాదు, సౌత్‌ కుర్రాళ్ల క్రష్‌ లిస్ట్‌లో చేరిపోయింది.  

భవ్య.. చెన్నైలో 1997, జనవరి 1న జన్మించింది. అక్కడే ఎంఓపీ వైష్ణవ్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్‌పై దృష్టిపెట్టింది.

This browser does not support the video element.

నిజానికి ఈ భామ మూడేళ్ల వయసు నుంచే యాడ్స్‌లో నటించడం మొదలుపెట్టింది. తండ్రి ప్రోత్సాహంతో చదువుతూనే పలు యాడ్స్‌లో నటిస్తూ వచ్చింది. 

తొలిసారిగా 2022లో తమిళ చిత్రం ‘కదిర్‌’తో వెండితెరకు పరిచయమైంది. అదే ఏడాది కన్నడ చిత్రం ‘డాలీ’తో శాండిల్‌వుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. 

ఆ రెండు సినిమాలు భవ్యకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టాయి. దీంతో అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే ‘జో’లో నటించి మరింత క్రేజ్‌ సంపాదించింది.

‘ఆడిషన్స్‌లో ఎంపిక అనేది ప్రతిభ మీదే ఆధారపడి ఉండాలి. అంతేగానీ, ఇతర అంశాలపై కాదు.’ అని క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో భవ్య చెప్పిన మాటలివి. 

హీరోల్లో రజినీకాంత్‌, హీరోయిన్లలో సమంతకు ఈమె వీరాభిమాని. అలియా భట్‌, కరీనా కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి నటించాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టింది.

భవ్య.. ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌. శరీరం నాజుగ్గా ఉండేందుకు జిమ్‌లో తెగ కష్టపడుతుంటుంది. ఆ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంటుంది కూడా. 

మోడలింగ్‌, సినిమాలు.. రెండింట్లో అవకాశాలు పొందడం చాలా సంతోషంగా ఉందంటున్న ఈ భామ ప్రస్తుతం ఇది మన్నల్‌ కాదల్‌, జిన్న్‌ చిత్రాలతో బిజీగా ఉంది.

శ్రద్ధా దాస్‌... రొయ్యల కూర.. భలే కాంబో

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

Eenadu.net Home