మీర్జాపూర్ బ్యూటీ.. శ్వేతా త్రిపాఠి..
శ్వేతా త్రిపాఠి శర్మ.. చాలాకాలంగా హిందీ సినిమా/వెబ్‌సిరీస్‌లో నటిస్తోన్నా.. ‘మీర్జాపూర్’తో పాపులరైంది. అందులో ప్రధాన పాత్ర గుడ్డు మరదలు గోలు గుప్తాగా కనిపించింది.
(Photos: Instagram/Shweta Tripathi Sharma)
‘మీర్జాపూర్’లో టీనేజీ అమ్మాయిలా కనిపించిన ఈ బ్యూటీ అసలు వయసు 38 ఏళ్లు. అయినా తరగని అందంతో ప్రేక్షకుల్ని ఫిదా చేస్తోంది.
తాజాగా విజయ్ వర్మ నటించిన ‘కాల్‌కూట్’వెబ్‌సిరీస్‌లోనూ శ్వేత నటించి ఆకట్టుకుంటోంది.
ఈ దిల్లీ సుందరి జులై 6, 1985లో జన్మించింది. తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ కావడంతో తన బాల్యం ఎక్కువగా అండమాన్ నికోబార్, మహారాష్ట్రలో గడిచింది.
ఆ తర్వాత దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసుకొని.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ చదివింది.
టీనేజ్‌లోనే ‘క్యా మస్త్ హై లైఫ్(2009)’ వెబ్‌సిరీస్‌తో తెరంగేట్రం చేసింది. ‘తృష్ణ’, ‘సుజాత’ చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించింది.
ఇక 2015లో వచ్చిన ‘మసాన్’లో విక్కీ కౌశల్‌కు స్నేహితురాలిగా నటించడంతో శ్వేతకు గుర్తింపు లభించింది.
ఆ తర్వాత ‘హరామ్‌కోర్’, ‘గాన్ కేష్’, ‘రాత్ అఖేలీ హై’, ‘రష్మీ రాకెట్’ తదితర చిత్రాల్లో నటించింది. ‘మెహందీ సర్కస్’తో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. ‘ది ఇల్లీగల్’ అనే ఇంగ్లీష్ చిత్రంలోనూ మెరిసింది.
ఇక వెబ్‌సిరీస్‌ల విషయానికొస్తే.. ‘ది ట్రిప్’, ‘మీర్జాపూర్’, ‘మేడ్ ఇన్ హెవెన్’, ‘లాఖోన్ మే ఏక్’, ‘ఎస్కేప్ లైఫ్’ తదితర వాటిలో నటించింది.
టాటా స్కై, మెక్ డొనాల్డ్స్, వొడాఫోన్, తనిష్క్, టాటా టీ వంటి పలు బ్రాండ్స్ యాడ్స్‌లోనూ శ్వేత నటించింది. ఫెమినా మ్యాగజీన్‌లో ఫొటో ఎడిటర్‌గా వ్యవహరిస్తోంది.
తెరపైకి రాకముందు ఈ ‘మీర్జాపూర్’ అందం ముంబయిలోని పిక్సియన్ అనే పోస్ట్ ప్రొడక్షన్ కంపెనీలో పని చేసింది. అలాగే ‘ఆల్ మై టీ ప్రొడక్షన్స్’ పేరుతో ఓ థియేటర్ కంపెనీని నడిపించింది.
శ్వేత.. యాక్టర్, ర్యాపర్ చైతన్య శర్మను 2018లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈమె ‘టికెట్ టు బాలీవుడ్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.