కజిరంగ జాతీయ పార్క్.. ఈ విశేషాలు తెలుసా?
అస్సాంలోని కజిరంగ జాతీయ పార్క్‌ను ప్రధాని మోదీ ఇటీవల సందర్శించారు. ఏనుగు ఎక్కి సఫారీ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ పార్క్‌ను సందర్శించాలని కోరారు. మరి దీని ప్రత్యేకతలేంటో చూద్దామా..
అస్సాంలోని గోలాఘాట్, నాగాం జిల్లాల మధ్య 430 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్‌ను 1905లో ప్రారంభించారు. 1974లో జాతీయ పార్క్ హోదా కల్పించారు.
యునెస్కో వారసత్వ సంపద జాబితాలోనూ చోటు సంపాదించుకున్న ఈ పార్క్‌లో ప్రపంచంలోనే అత్యధిక ఖడ్గమృగాలు ఉన్నాయి. 3 వేలకుపైగా ఉంటాయని అంచనా.
ఈ పార్క్.. ఖడ్గమృగాలతోపాటు పులులు, ఏనుగులు, పాంథర్స్, ఎలుగుబంట్లు, అటవీ బర్రెలు, ఇలా అనేక రకాల జంతువులు, పక్షులు, వృక్షాలకు నిలయంగా మారిపోయింది.
కజిరంగా అడవులా గుండానే 37 జాతీయ రహదారి ఉంటుంది. ఈ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఏనుగులు, ఖడ్గమృగాలు కనిపిస్తాయి. టీ తోటలు కనువిందు చేస్తాయి.
నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ పార్క్ సందర్శనకు అనువైన కాలం. ఇక్కడ ఏనుగు.. జీప్ సఫారీ, పార్క్ మధ్యలో ప్రవహించే బ్రహ్మపుత్ర నదిలో బోటింగ్ చేయొచ్చు. హైకింగ్‌కు అనుమతి లేదు.
ప్రపంచంలోనే అతిపెద్ద పాములు రెటిక్యులెటెడ్ పైతాన్, ఇండియన్ రాక్ పైతాన్‌తోపాటు అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా ఇందులో కనిపిస్తాయి. అరుదైన రాబందులనూ చూడొచ్చు.
జోర్హట్, తేజ్‌పుర్, దిమాపుర్, గువాహటి నుంచి రోడ్డు, విమాన మార్గంలో రావొచ్చు. పార్క్ సమీపంలో పర్యటకులకు బస చేసేందుకు రిసార్ట్స్ అందుబాటులో ఉంటాయి. టూర్ ప్యాకేజీలుంటాయి.