8 భాషలు.. 10 వేల స్క్రీన్లు: ‘కంగువా’ విశేషాలివీ!

ఇది..సూర్య 42వ చిత్రం. దర్శకుడు శివ 10వ సినిమా. ఇద్దరి కాంబినేషన్‌లో ఫస్ట్‌ మూవీ.

కంగ, ఫ్రాన్సిస్‌ పాత్రలు పోషించిన సూర్య విభిన్న గెటప్పుల్లో కనిపించనున్నారు.

ఈ సినిమాతో దిశా పటానీ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. 

బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ నటించిన తొలి దక్షిణాది చిత్రమిది. 

సూర్య సోదరుడు కార్తి సహా పలువురు నటులు తళుక్కున మెరవనున్నారు.

తమిళ్‌లో సూర్య డబ్బింగ్‌ చెప్పగా.. ‘ఏఐ’ సాయంతో వేరే భాషల్లో డబ్బింగ్‌ చేసిన ఫస్ట్‌ కోలీవుడ్‌ మూవీ.

1500 ఏళ్ల నాటి ప్రపంచం, అప్పటి మనుషుల భావోద్వేగాలు ప్రధానాంశాలుగా నడిచే కథ ఇది.

మొసలితో హీరో చేసే ఫైట్‌ సినిమాకే హైలైట్‌ అట. అండర్‌ వాటర్‌లో వారంపాటు చిత్రీకరించారట.

రూ.300 కోట్లకుపైగా బడ్జెట్‌.. తెలుగు సహా 8 భాషల్లో దాదాపు 10 వేల స్క్రీన్స్‌లో ప్రదర్శితం కానుంది.

3డీలోనూ విడుదలవుతుంది. రన్‌టైమ్‌: 2 గంటల 34 నిమిషాలు.

సూర్య బెస్ట్‌ చిత్రాలు.. ఏ ఓటీటీలో...

మిల్కీ బ్యూటీ.. ట్రెండింగ్‌ క్యూటీ!

నేను ఫుడ్‌ లవర్‌ని.. నోరు కట్టేసేకోను!

Eenadu.net Home