ఇంట్లో ఒప్పించి.. ప్రేక్షకుల్ని మెప్పించి
‘పేక మేడలు’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది అనూషా కృష్ణన్. జులై 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆగస్టు 15 నుంచి ‘ఈటీవీ విన్’లో స్ట్రీమ్ అవుతోంది.
అనూష కర్ణాటకలో పుట్టింది. చదువు బెంగళూరులో సాగింది. ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది.
ఈమెకి నాటకాలు, నాటికలు వేయడం అంటే ఇష్టం. ఆ సమయంలో ‘నువ్వు యాక్టర్‌గా ఎందుకు ప్రయత్నించకూడదు’ అని తెలిసినవాళ్లు అడగ్గా.. అప్పుడు ఆడిషన్స్‌కి హాజరవ్వడం ప్రారంభించింది.
చిన్నప్పట్నుంచీ నటన అంటే ఆసక్తి. అందుకే స్టేజీ పర్‌ఫార్మెన్స్‌లు ఇచ్చేది.
నటిస్తాను అని ఇంట్లో చెప్పినప్పుడు ఎవరూ ఒప్పుకోలేదట. వాళ్లతో యస్ అనిపించుకోవడానికి అనూషకి చాలా కాలం పట్టింది.
‘కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం నాకు బాగా నచ్చుతుంది. యాక్టర్‌గా అది నా బాధ్యత. ఓ సినిమా కోసం గిటార్ వాయించడం నేర్చుకున్నాను’ అని చెప్పింది.
This browser does not support the video element.
కన్నడలో ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్ పూర్తి చేసుకుంది. అవి విడుదల కావాల్సి ఉన్నాయి.
‘సమాజంలో అమ్మాయిల జీవితం ఎంత దుర్భరంగా ఉన్నా.. సర్దుకుపోయి బతుకుతున్నారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతూ, ఇంటిని నడపగలమనే ధైర్యంతో ముందుకు సాగాలి’ అంటూ సలహా ఇస్తోంది.
అనూషకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. ‘ఎప్పుడూ ఒకే చోట ఉంటే బోరింగ్‌గా అనిపిస్తుంది. అందుకే తరచూ ట్రిప్‌లకి వెళుతుంటాను’ అని అంటోంది.