కరిష్మా.. సొగసు చూడతరమా..!
జిగ్నా వోరా రాసిన ‘బిహైండ్ బార్స్ ఇన్‌ది బైకుల్లా: మై డేస్ ఇన్ ప్రిజన్’ పుస్తకం ఆధారంగా ఓ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కరిష్మా తన్నా.
Image: instagram/Karishma Tanna
‘స్కూప్’ పేరుతో దర్శకుడు హన్సల్ మెహతా ఈ వెబ్‌సిరీస్ తీస్తున్నారు. జూన్ 2వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకానున్న ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది.
Image: instagram/Karishma Tanna
ఈ వెబ్‌సిరీస్‌లో డిప్యూటీ బ్యూరో చీఫ్‌గా ఎదిగిన జాగృతి అనే క్రైమ్ రిపోర్టర్ పాత్రను కరిష్మా పోషిస్తోంది. తనపై పడ్డ ఆరోపణను తప్పని జాగృతి నిరూపించే ప్రయత్నమే కథ.
Image: instagram/Karishma Tanna
కరిష్మా.. 1983 డిసెంబర్ 21న ముంబయిలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో జన్మించింది. చదువు పూర్తి కాగానే.. టీవీ సీరియల్స్‌తో కెరీర్‌ను ప్రారంభించింది.
Image: instagram/Karishma Tanna
తొలిసారిగా 2001లో ప్రారంభమైన ‘క్యూంకీ సాస్ భి కభీ బహూ థి’ సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది కరిష్మా.
Image: instagram/Karishma Tanna
సీరియల్స్‌లో నటిస్తూనే పలు బ్రాండ్స్ ప్రచార చిత్రాల్లో నటించింది. మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ మెరిసింది.
Image: instagram/Karishma Tanna
ఇక 2005లో ‘దోస్తీ: ఫ్రెండ్స్ ఫరెవర్’తో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత ‘ఐయామ్ సారీ మతె బన్ని ప్రీత్సోనా’ అనే కన్నడ చిత్రంలోనూ నటించింది.
Image: instagram/Karishma Tanna
‘గ్రాండ్ మస్తీ’, ‘గోల్లు ఔర్ పప్పు’, ‘సంజూ’ ‘సూరజ్ పె మంగళ్ భరి’, ‘లాహోర్ కాన్ఫిడెన్షియల్’ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Image: instagram/Karishma Tanna
ఓ వైపు సినిమాలు, సీరియల్స్ చేస్తూనే హిందీలో ప్రసారమయ్యే అనేక రియాల్టీ షోల్లో కరిష్మా పాల్గొంది.
Image: instagram/Karishma Tanna
‘బిగ్‌బాస్’, ‘ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కె ఖిలాడీ’, ‘ఝలక్ దిఖ్లా ఆజా’, ‘బిగ్ మేమ్‌సాబ్’ ఇలా చాలా షోల్లో పాల్గొంది. ‘ఖత్రోన్ కె ఖిలాడీ 10’ విజేతగా నిలవడంతో బాలీవుడ్‌లో ఈమెకు క్రేజ్ పెరిగింది.
Image: instagram/Karishma Tanna
గత కొన్నాళ్లుగా కరిష్మా.. వెబ్‌సిరీస్‌లపైనే దృష్టిపెట్టింది. 2022లో ‘గిల్టీ మైండ్స్’, ‘హుష్ హుష్’తో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ‘స్కూప్’తో వస్తోంది.
Image: instagram/Karishma Tanna
గతేడాదే ముంబయికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వరుణ్ బంగెరాను కరిష్మా వివాహమాడింది.
Image: instagram/Karishma Tanna
This browser does not support the video element.
కరిష్మా.. ఫిట్‌నెస్ ఫ్రీక్. ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరిగా చేస్తుంటుంది. దీనికి సంబంధించిన వీడియోలను తరచూ తన ఇన్‌స్టాలో పోస్టు చేస్తోంది.
Video: instagram/Karishma Tanna
సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే కరిష్మాకు ఇన్‌స్టాలో 7.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
Image: instagram/Karishma Tanna