‘గుర్తుందా శీతాకాలం’ అంటోన్న కన్నడ భామ!

సత్యదేవ్‌ హీరోగా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ ఈ మధ్యే విడుదలైంది. ఈ చిత్రంతో మరో కన్నడ భామ కావ్య శెట్టి టాలీవుడ్‌ తెరకు పరిచయమైంది.

Image: Instagram/kavya shetty

ఇందులో కాలేజీ అమ్మాయి అమృత పాత్రలో కనిపించిన కావ్య.. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

Image: Instagram/kavya shetty

కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన కావ్య.. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చేసింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌ చేస్తూ.. పలు టీవీ ప్రచార చిత్రాల్లో నటించింది.

Image: Instagram/kavya shetty

అంతేకాదు, 2011లో మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఈ సాండల్‌వుడ్‌ బ్యూటీ.. ‘మిస్‌ ఫొటోజెనిక్‌’ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫ్యాషన్‌ షోల్లో ర్యాంప్‌ వాక్‌ చేసి మోడల్‌గా గుర్తింపు పొందింది. పెద్ద పెద్ద బ్రాండ్ల యాడ్స్‌లో మెరిసింది. 

Image: Instagram/kavya shetty

మొదట 2012లోనే తెలుగు, తమిళ్ ద్విభాష చిత్రం ‘శివాని’తో కావ్య వెండితెరకు పరిచయం కావాల్సింది. కానీ, వివిధ కారణాలతో ఆ చిత్రం పూర్తి కాలేదు. 

Image: Instagram/kavya shetty

This browser does not support the video element.

ఆ తర్వాత 2013లో విడుదలైన ‘నమ్‌ దునియా నమ్‌ స్టైల్‌’ అనే కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసింది కావ్య.

Image: Instagram/kavya shetty

ఆమె నటనకు ప్రేక్షకులతోపాటు సినీ వర్గాలు ఫిదా అయ్యాయి. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా కన్నడలో వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉంది కావ్య. 

Image: Instagram/kavya shetty

తమిళ్‌లో ‘ఇదు ఎన్న మాయం’, ‘కెప్టెన్‌’లో నటించింది. మాలీవుడ్‌లో ‘బ్రో డాడీ’తో ఎంట్రీ ఇచ్చింది. 

Image: Instagram/kavya shetty

ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటించిన ఈ భామ.. చేతిలో ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులున్నాయి. తెలుగులో వెనువెంటనే సినిమాలు చేయదట. మంచి కథ దొరికితేనే నటిస్తానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.  

Image: Instagram/kavya shetty

This browser does not support the video element.

‘కన్నడ హీరోయిన్లు తెలుగులో రాణిస్తుండటం బాగుంది. కన్నడలో కూడా ఇతర భాషలకి చెందిన హీరోయిన్లు నటిస్తున్నారు. మేం కూడా ఇతర భాషల్లో రాణించడం మేలే కదా!’ అని అంటోంది కావ్య.

Image: Instagram/kavya shetty

‘నటులకి ఏ పరిశ్రమ అయినా ఒక్కటే. పని విషయంలో నాకైతే తేడాలేమీ కనిపించలేదు. కన్నడలో సులభంగా నటించగలను. ఇతర భాషల్లో అయితే.. ముందుగా కసరత్తు చేస్తా’ అని తెలిపింది. 

Image: Instagram/kavya shetty

కావ్య శెట్టికి పుస్తకపఠనం హాబీ. సమయం దొరికితే.. పుస్తకాలతోనే గడిపేస్తుంటుంది. తను చదివిన పుస్తకాల గురించి ఇన్‌స్టాలో పోస్టులు కూడా పెడుతుంటుంది.

Image: Instagram/kavya shetty

ఈ భామకు ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. తరచూ విహారయాత్రలకు వెళ్తుంటుంది. యూకే, టర్కీ, ఇటలీ, ఫ్రాన్స్‌, అండమాన్‌, దుబాయ్‌ ఇలా చాలా ప్రదేశాలు చుట్టేసింది.

Image: Instagram/kavya shetty

చమ్కీలా.. సుందరి

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

చందనాల బుట్టబొమ్మ

Eenadu.net Home