దక్షిణాదిన మెరుస్తోన్న అస్సాం తార!

ముంబయి, కన్నడ, మలయాళీ తారలు తెలుగుతెరపై ఎక్కువగా మెరిశారు. తాజాగా అస్సాంకి చెందిన ఓ భామ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

Instagram/Kayadu Lohar

ఆమెనే కయ్యదు లోహర్‌. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ‘అల్లూరి’లో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం సెప్టెంబర్‌ 23న విడుదలైంది.

Instagram/Kayadu Lohar

అస్సామీ కుటుంబంలో ఏప్రిల్‌ 11, 2000న జన్మించిన కయ్యదు.. మహారాష్ట్రలోని పుణెలో పెరిగింది.

Instagram/Kayadu Lohar

మోడలింగ్‌పై ఇష్టంతో ఫ్యాషన్‌ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో 2021లో కన్నడలో ‘ముగిల్‌పిటి’తో తెరంగేట్రం చేసింది.

Instagram/Kayadu Lohar

ఆ సినిమా తర్వాత కయ్యదుకు దక్షిణాది చిత్రాల్లో ఆఫర్లు క్యూ కట్టాయి.

Instagram/Kayadu Lohar

ఇప్పటికే మలయాళ పీరియాడిక్‌ చిత్రం ‘19వ శతాబ్దం’లో నటించింది. ఇది పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కింది.

Instagram/Kayadu Lohar 

తమిళంలో గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించిన ‘వెందు తనింతత్తు కాదు’లో అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల నటించలేదు.

Instagram/Kayadu Lohar

తొలి సినిమా ‘ముగిల్‌పిటి’లో కయ్యదు నటనకు మంచి పేరొచ్చింది. ‘మిమ్మల్ని ఇతరులు గుర్తించాలంటే కష్టపడి పని చేయాలి’అని ఓ సందర్భంలో తెలిపింది.

Instagram/Kayadu Lohar

వివిధ భాషల్లో నటించడం కాస్త కష్టమే అయినా.. ఏ భాషనైనా తొందరగా నేర్చుకుంటానని కయ్యదు లోహర్‌ చెబుతోంది.

Instagram/Kayadu Lohar

‘‘రెండు పాటలు, నాలుగు సన్నివేశాల్లో కనిపించే హీరోయిన్‌ను కాదు నేను. బలమైన పాత్రలకు న్యాయం చేయగలను’’ అని అంటోంది కయ్యదు.

Instagram/Kayadu Lohar

సూట్‌.. అదిరేలా ఫొటోషూట్‌!

శ్రద్ధా దాస్‌... రొయ్యల కూర.. భలే కాంబో

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

Eenadu.net Home