వినాలీ.. అందాల చమేలీ!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం.. ‘కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. వినాలీ భట్నాగర్.
Image: Instagram/Vinali Bhatnagar
నలుపు రంగు దుస్తుల్లో అందరినీ ఆకట్టుకున్న ఈ భామ ఎవరా అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.. ఇంతకీ ఎవరీమే..
Image: Instagram/Vinali Bhatnagar
వినాలీ ఫ్యాషన్ రంగంలో ప్రముఖ మోడల్. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పుట్టి పెరిగింది.
Image: Instagram/Vinali Bhatnagar
లండన్‌కు వెళ్లి.. ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. భారత్‌కు తిరిగొచ్చి.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. పలు బ్రాండ్స్ ప్రచార చిత్రాల్లోనూ నటించింది.
Image: Instagram/Vinali Bhatnagar
వివిధ అందాల పోటీల్లో పాల్గొంది. 2017లో ‘మిస్ ఇండియా ఛత్తీస్‌గఢ్’ టైటిల్ గెలుచుకుంది.
Image: Instagram/Vinali Bhatnagar
చిన్నతనం నుంచి నటి అవ్వాలన్న కోరిక వినాలీకి ఉండేదట. అందుకే, ముంబయికి మకాం మార్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది.
Image: Instagram/Vinali Bhatnagar
ఇటీవల పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ నటించింది. ‘ఖాఫిల్ నూర్ కే’ పాటతో కాస్త గుర్తింపు లభించింది.
Image: Instagram/Vinali Bhatnagar
ఇప్పుడు ‘కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్’తో వెండితెరపై కనిపించబోతోంది. తన కల నిజమవుతున్నందుకు ఎంతో సంబరపడిపోతోంది.
Image: Instagram/Vinali Bhatnagar
సాధారణ ప్రేక్షకుల్లో ఒకరిగా సినిమా చూసిన తను.. ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ చిత్రంతో తెరంగేట్రం చేయడం నమ్మలేకపోతున్నానంటూ.. ట్రైలర్ లాంచ్‌లో సంతోషం వ్యక్తం చేసింది.
Image: Instagram/Vinali Bhatnagar
రణ్‌బీర్ కపూర్, మాధురీ దీక్షిత్.. వినాలీ అభిమాన నటులు. దర్శకుల్లో సంజయ్‌లీలా భన్సాలీ చాలా ఇష్టమట.
Image: Instagram/Vinali Bhatnagar
వినాలీ మాంచి భోజనప్రియురాలు. వృత్తిరీత్యా ఎక్కడికి వెళ్లినా.. అక్కడి వంటకాలను కచ్చితంగా రుచి చూస్తుంటుంది.
Image: Instagram/Vinali Bhatnagar
దక్షిణ భారత వంటకాలు ఈ సుందరికి బాగా నచ్చుతాయట. ముఖ్యంగా ఇడ్లీ, దోశ చాలా ఇష్టంగా తింటుందట.
Image: Instagram/Vinali Bhatnagar
ఖాళీ సమయం దొరికితే.. విహారయాత్ర కోసం యూకే, అమెరికాకు వెళ్తుంటుంది.
Image: Instagram/Vinali Bhatnagar
వినాలీ.. మంచి డ్యాన్సర్ కూడా. కథక్ నాట్యంలో శిక్షణ తీసుకుంది.
Image: Instagram/Vinali Bhatnagar