ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

‘సైరెన్’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది కీర్తి సురేశ్‌. పోలీసుగా ఆ సినిమాలో విమర్శకుల ప్రశంసలూ అందుకుంది.  

 ‘రఘుతాత’, ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివెడి’ తదితర తమిళ చిత్రాల షూటింగ్‌తో బిజీబిజీగా ఉంది. 

వరుణ్‌ధావన్‌ హీరోగా ‘బేబి జాన్‌’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. మే 31న ఈ సినిమా విడుదల కానుంది.

This browser does not support the video element.

‘బేబి జాన్‌’ షూటింగ్‌లో కీర్తి చేసిన సందడి వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చిన్నప్పట్నుంచే కీర్తికి స్విమ్మింగ్‌ అంటే ఇష్టం. స్కూలు రోజుల్లోనే పోటీల్లో పాల్గొని ఎన్నో అవార్డులను గెలుచుకుంది కూడా.

శాకాహారి అయిన ఈమెకి ఇంటి ఆహారమే నచ్చుతుంది. దోశ అంటే మహా ఇష్టం. వారానికి రెండు సార్లు మాత్రమే బయటి ఆహారం అది కూడా వెజ్‌ దోశ, పిజ్జా లాంటివి తింటుందట. 

సీజన్‌కి తగ్గట్లు తాజా పండ్లను తీసుకోవడంతో పాటు రోజూ యోగా చేయడం.. తన బ్యూటీ సీక్రెట్‌ అని చెబుతోంది.

సూర్య, విజయ్‌కి కీర్తి వీరాభిమాని. వాళ్ల సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్‌ కొట్టవని చెప్పింది. ఇక హీరోయిన్లలో సిమ్రన్‌ అంటే ఇష్టపడుతుంది. 

బంధువులతో కలిసి పండుగలు, పార్టీల సమయాల్లో చీరకట్టులో సందడి చేస్తుంది. ఆ కట్టుబొట్టుకు పెద్ద ఫ్యాన్‌బేసే ఉంది. 

This browser does not support the video element.

బైక్‌ రైడింగ్‌ అంటే ఇష్టం ఉన్నా ఎప్పుడూ నేర్చుకునే ధైర్యం చేయలేదట. ‘మామన్నన్‌’ కోసం నేర్చుకుంది. 

అప్పుడప్పుడూ ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా రీల్స్‌ చేసి వాటిని ఇన్‌స్టాలో పంచుకుంటుంది. తన ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్ల సంఖ్య 1. 50 లక్షలకు పైమాటే!

This browser does not support the video element.

దర్శకుడు అట్లీ భార్య ప్రియతో కలసి ‘జవాన్‌’ పాటకు ఆమె చేసిన డ్యాన్స్‌ వీడియో ఇప్పటికీ లైక్‌లు సంపాదిస్తూనే ఉంది.

కేన్స్‌లో హాలీవుడ్‌ సొగసులు

‘విశ్వంభర’లో ఆషికా రంగనాథ్‌

సొంత అవుట్‌ ఫిట్‌తో కేన్స్‌కు!

Eenadu.net Home