మెగా హీరోలతో ‘రొమాంటిక్‌’ హీరోయిన్!

గతేడాది వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ‘రంగ రంగ వైభవంగా’లో నటించింది.. కేతిక శర్మ. ఇప్పుడు వైష్ణవ్‌ సోదరుడు సాయిధరమ్‌ తేజ్‌కు జోడీగా నటిస్తోంది. 

Image: Instagram/Kethika sharma

తమిళ చిత్రం ‘వినోదాయ సిద్ధం’ను పవన్‌కల్యాణ్‌, సాయి తేజ్‌ ప్రధాన పాత్రధారులుగా సముద్రఖని రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండగా.. ఒక హీరోయిన్‌ కేతిక.

Image: Instagram/Kethika sharma

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ హీరోగా వచ్చిన సినిమా ‘రొమాంటిక్‌’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది కేతిక. ఈ సినిమాలో తన అందచందాలతో అలరించింది.

Image: Instagram/Kethika sharma

నాగశౌర్య హీరోగా గతేడాది విడుదలైన 'లక్ష్య'లోనూ హీరోయిన్‌గా నటించింది.

Image: Instagram/Kethika sharma

ఈ అందాల భామ 1995 డిసెంబరు 24న దిల్లీలో జన్మించింది. ఈమెది డాక్టర్స్‌ ఫ్యామిలీ. కుటుంబసభ్యులు, బంధువుల్లో చాలా మంది వైద్యులే ఉన్నారట.

Image: Instagram/Kethika sharma

ఈమె నటి కావాలని చిన్నప్పుడే ఫిక్సయిందట. ఇన్‌స్టాగ్రామ్‌లో కేతిక పోస్ట్‌ చేసిన ఫొటోలు, వీడియోలు చూసి ‘పూరి కనెక్ట్స్‌’ నిర్మాణ సంస్థ నుంచి ఆహ్వానం అందుకుని హీరోయిన్‌గా ఎంపికైంది.

Image: Instagram/Kethika sharma

‘‘నాకు భాష అనేది హద్దు కాదు. అలా అనుకుంటే తొలి చిత్రం తెలుగులో చేసేదాన్ని కాదు. నటిగా ప్రతి భాషలోనూ నటించాలనుంది. అన్ని రకాల పాత్రలు పోషించాలని ఉంది’’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

Image: Instagram/Kethika sharma

ఈ ఉత్తరాది భామకు సింగింగ్‌, డ్యాన్సింగ్ అంటే చాలా ఇష్టమట. రొమాంటిక్‌ చిత్రంలో ‘నా వల్ల కాదే’ అనే పాట కూడా పాడింది.

Image: Instagram/Kethika sharma

ఈమెకు సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ ఉంది. తన లేటెస్ట్ అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.7 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

Image: Instagram/Kethika sharma

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

ఈ హీరోయిన్ల ‘టాటూ’ అర్థం తెలుసా?

స్ట్రాప్‌లెస్‌ ట్రెండ్‌ గురించి విన్నారా!

Eenadu.net Home