బైబై.. బడా గణేశా..!

ఏటా భాగ్యనగరంలో ఘనంగా ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అసలీ వేడుక ఎప్పుడు మొదలైంది, దానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు ఏంటో చూద్దామా..!

ఖైరతాబాద్ గణేశుడిని మొదటి సారిగా 1954లో అడుగు ఎత్తుతో ప్రతిష్ఠించారు. ఆ తర్వాత నుంచి ప్రతి ఏడాది ఓ అడుగును పెంచడం ఆనవాయితీగా మారింది.

ఈ ఏడాది 70 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో ‘సప్తముఖ మహాశక్తి గణపతి’గా దర్శనమిచ్చారు. పర్యావరణ హితంగా మట్టి విగ్రహాన్నే పెట్టడం విశేషం.

1000 సంచుల మట్టి, 18 టన్నుల ఇనుము, 2వేల మీటర్ల నూలు వస్త్రం​, 2 వేల మీటర్ల జూట్​ను​ ఉపయోగించి ఈ బడా గణేశ్‌ని రూపొందించారు. 

ఈ విగ్రహానికి 7 ముఖాలు. ఓ వైపు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మరోవైపు సరస్వతి, మహాలక్ష్మీ, పార్వతి, మధ్య గణపతిని తీర్చిదిద్దారు.

70 ఏళ్లు అయిన సందర్భంగా 7 అంకెకు ప్రాధాన్యమిస్తూ 7 తలలు, 7 సర్పాలు.. రెండు వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో ఇక్కడి విఘ్నేశ్వరుడు సిద్ధమయ్యాడు.

ఈసారి ప్రత్యేకంగా అయోధ్య బాలరాముడిని గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించడం విశేషం.

ఈ బడాగణేశ్‌ని పూర్తిగా తీర్చిదిద్దేందుకు దాదాపు 78 రోజులు పట్టిందట.

ఏటా ఈ గణపతిని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. 

వ్యక్తిత్వ వికాసానికి గురునానక్‌ సూక్తులు

చాణక్య చెప్పిన నీతి వాక్యాలు

భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ హిందూ ఆలయాలున్నాయి..!

Eenadu.net Home