సెల్ఫీ సుందరి.. థాంక్యూ చెబుతోంది
బాలీవుడ్ భామ భూమి పడ్నేకర్, షెహనాజ్ గిల్, డాలీ సింగ్ తదితరులు నటించిన చిత్రం ‘థాంక్యూ ఫర్ కమింగ్’. ఇందులో మరో బ్యూటీ కూడా నటిస్తోంది. తనే కుశ కపిలా.
(Photos: Instagram/Kusha Kapila)
ఇటీవల అక్షయ్‌కుమార్, ఇమ్రాన్ హష్మీ కలిసి నటించిన ‘సెల్ఫీ’ చిత్రంలో.. ‘మైనస్ వన్: న్యూ చాప్టర్’, ‘సోషల్ కరెన్సీ’ వెబ్‌సిరీస్‌ల్లో నటించి మెప్పించింది.
కుశ కపిలా.. న్యూదిల్లీకి చెందిన పంజాబీ బ్యూటీ. సెప్టెంబర్ 19,1989న జన్మించింది. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ చేసింది.
చదువు పూర్తి కాగానే.. ఫ్యాషన్ రంగంలోనే పలు సంస్థల్లో ఉద్యోగం చేసింది. ఆ తర్వాత 2014లో కాపీ రైటర్‌గా మారింది.
అదే ఏడాది ‘సన్ ఆఫ్ అబిష్’అనే టీవీ షోతో తెరంగేట్రం చేసింది. 2016లో ఓ ప్రముఖ మీడియా సంస్థలో ఫ్యాషన్ ఎడిటర్‌గా వ్యవహరించింది.
ఆ తర్వాత ‘ఐదివా’ అనే మరో ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ వెబ్‌సైట్‌లో కంటెంట్ రైటర్‌గా చేరింది. అక్కడ తను సృష్టించిన ‘బిల్లి మసి’ అనే కల్పిత పాత్ర బాగా పాపులర్ కావడంతో తనూ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది.
నటనపైనా ఆసక్తి ఉండటంతో 2020లో నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ‘ఘోస్ట్ స్టోరీస్’తో మరోసారి తెరపై మెరిసింది. అమెజాన్‌లో ప్రసారమైన పలు కామెడీ షోల్లో పాల్గొని ఫాలోయింగ్ పెంచుకుంది.
రితేశ్ దేశ్‌ముఖ్, తమన్నా నటించిన ‘ప్లాన్ ఏ ప్లాన్ బి’లో కీలక పాత్ర పోషించింది. పలు మ్యాగజైన్ కవర్ పేజీలపై తన ఫొటోలు వచ్చాయి.
ఈ దిల్లీ భామ.. 2017లో జోరవార్ సింగ్ అహ్లువాలియాను వివాహమాడింది. తాము విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించింది.
ఈ భామ నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ ఫర్ కమింగ్’ను టోరొంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. అక్టోబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది.