నా ఎత్తే నాకు మైనస్
ఇటీవల విడుదలైన ‘లంబసింగి’తో ప్రేక్షకులను అలరిస్తోంది బిగ్‌బాస్ బ్యూటీ దివి. భరత్ రాజ్ హీరోగా దర్శకుడు నవీన్ గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
మోడల్‌గా 2017లో కెరీర్‌ను మొదలుపెట్టిన ఈ హైదరాబాదీ ‘లెట్స్ గో’(2018)తో వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత కొన్ని లఘుచిత్రాలతో అలరించింది.
మహేష్‌బాబు ‘మహర్షి’లో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ‘బిగ్‌బాస్ 4’లో పాల్గొని టీవీ ప్రేక్షకుల అభిమానాన్నీ సంపాదించుకుంది. ఈమెకి తింగర బుచ్చి అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. రీల్స్, షార్ట్స్ షేర్ చేస్తూ ఉంటుంది.
రవితేజ చిత్రంలో తనకి హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారని.. ఏమైందో తెలియదు కానీ రాత్రికి రాత్రే తనని సినిమా నుంచి తొలగించారని, అప్పుడు ఎంతో బాధపడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
‘నేను 5.8 అంగుళాల ఎత్తు ఉండటం కూడా చాలాసార్లు మైనస్ అయ్యింది. ఇంత ఎత్తు ఉన్నావేంటి అంటూ ఎంతో మంది దర్శకులు రిజెక్ట్ చేశారు’ అని తెలిపింది.
‘క్యాబ్ స్టోరీస్’, ‘గాడ్ ఫాదర్’, ‘జిన్నా’, ‘ఏటీయమ్’ వంటి చిత్రాలు/వెబ్‌సిరీస్‌ల్లో మెరిసింది. ‘పుష్ప 2’, ‘కోకో’, ‘హరికథ’లో నటించగా.. అవి విడుదలకు సిద్ధమవుతున్నాయి.
‘ప్రేమించిన అబ్బాయితో రిలేషన్‌షిప్ వర్కౌట్ కాలేదు. అతడికి పెళ్లైంది. సంతోషంగా ఉన్నాడు. ఆ బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రేమించే ఉద్దేశం రాలేదు. కెరీర్‌పై దృష్టి పెట్టాను’ అంటోంది దివి.
This browser does not support the video element.
‘‘టైటానిక్’ అంటే ఇష్టం. దాదాపు ఓ 50 సార్లైనా చూసి ఉంటాను. అలాగే ప్రభాస్‌కి వీరాభిమానిని. నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ప్రభాస్‌లాగే ఉండాలనుకుంటున్నాను’ అని మనసులో మాట బయట పెట్టింది దివి.
ఓ యాక్షన్ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్ నేర్చుకుందట. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ దశలో ఉంది.
This browser does not support the video element.
ఈ బ్యూటీ ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటుంది. గ్లామర్ ఒలకబోస్తూ తను పోస్టు చేసే ఫొటోలకు కుర్రకారు ఫిదా అవుతోంది. దివిని ఇన్‌స్టాలో 11లక్షల మంది ఫాలో అవుతున్నారు.