ఎడమచేతివాటం.. మీకివి తెలుసా?

ఎడమ చేతి వాటం ఉన్న వారి ఇబ్బందులపై అవగాహన కల్పించడంతో పాటు వారి ప్రత్యేకతలను చాటి చెప్పడమే లక్ష్యంగా ఏటా ఆగస్టు 13న ‘అంతర్జాతీయ ఎడమచేతి వాటం వ్యక్తుల దినోత్సవం’ జరుపుకొంటుంటారు.

Image: Unsplash

ప్రపంచ జనాభాలో ఎడమచేతివాటం వాళ్లు 10 - 12 శాతం ఉన్నారట.

Image: Unsplash

ఎడమచేతివాటం ఉన్నవారికి స్వతంత్ర భావాలు, జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటాయి. 

Image: Unsplash

మహాత్మాగాంధీ, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, బరాక్‌ ఒబామా, రతన్‌ టాటా, నటి సావిత్రి, అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, సూర్యకాంతం, మమ్ముట్టి వంటి పలువురు ప్రముఖులు కూడా ఎడమచేతివాటం వారే.

Image: Twitter

సచిన్‌ తెందూల్కర్‌, రవిశాస్త్రి, సౌరభ్‌ గంగూలీ, యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, శిఖర్‌ ధావన్‌, కుంబ్లే, జహీర్‌ఖాన్‌ ఇలా చాలా మంది క్రికెటర్లు లెఫ్ట్‌ హ్యాండర్సే. టెన్నిస్‌ ప్లేయర్స్‌, స్విమ్మర్స్‌, బాక్సర్స్‌లోనూ ఇలాంటి వారే ఎక్కువగా కనిపిస్తారు. 

Image: Instagram

బేస్‌బాల్‌, బాక్సింగ్‌, ఫెన్సింగ్‌, టెన్నిస్‌ వంటి క్రీడల్లో కుడి చేతివాటం వారితో పోలిస్తే ఎడమ చేతివాటం వారికి కాస్త ప్రయోజనం ఎక్కువ.

Image: Unsplash

టైపింగ్‌లోనూ వీరికి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. క్వర్టీ కీబోర్డులో ఒక్క ఎడమ చేతితో వీరు 3000 పదాలను టైప్‌ చేయగలరు. అదే కుడి చేయి మాత్రమే వినియోగించి 300 పదాలు మాత్రమే టైప్‌ చేయగలం.

Image: Unsplash

కొంతమంది ఎడమ చేతివాటం వారన్నా.. ఎడమ దిశ అన్నా.. భయపడుతుంటారు. దాన్ని సినిస్ట్రోఫోబియా అంటారు.

Image: Unsplash

కుడి చేతి అలవాటున్న వారి కన్నా ఎడం చేతి అలవాటున్న వారికి షిజోఫెర్నియా అనే వ్యాధి వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని, పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయని పరిశోధకులు వివరించారు.

Image: Unsplash

మల్టీటాస్కింగ్‌ కుడిచేతివాటం వారికంటే.. ఎడమచేతివాటం ఉన్న వారు సులభంగా చేయగలరట. ఇతరులు పనుల్ని విడి విడిగా చూస్తే.. వీరు అన్నింటినీ ఒకే పనిలా భావిస్తారట.

Image: Unsplash

మార్కెట్లో లభించే సాధారణ పెన్నులతో రాయడం ఎడమచేతివాటం వారికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. వీరికోసం ప్రత్యేకంగా రూపొందించిన పెన్నులు అందుబాటులో ఉన్నాయి.

Image: Amazon

మనకూ ఉందొక ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌!

ఖరీదైన నగరాలివే..!

బ్రెజిల్‌లో గాల్లోనే తినేయొచ్చు!

Eenadu.net Home