బర్గర్‌ అంటే ప్రాణం.. లువానా గురించి మీకు తెలుసా?

ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఓ స్విమ్మర్‌ తన అందం వల్ల స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. దీంతో ఆమె ఎవరు అనే చర్చ మెదలైంది. అలా వైరల్‌గా మారిన లువానా అలోన్సో గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

 లువానా అలోన్సో స్విమ్మర్‌. సెప్టెంబర్‌ 19, 2004న దక్షిణ అమెరికాలోని పరాగ్వేలో జన్మించింది. డల్లాస్‌లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో చదువుతోంది.

17 ఏళ్ల వయసులో మొదటిసారిగా ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగి 28వ స్థానంలో నిలిచింది. 

 పారిస్‌ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల ఉమెన్స్‌ బటర్‌ఫ్లై పోటీల్లో పాల్గొని 0.24 సెకన్ల తేడాతో పతకం మిస్‌ చేసుకుంది. 

ఆ తర్వాత స్విమ్‌ సూట్లతో అక్కడ కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె వ్యవహారం సొంత బృందానికే చిరాకు తెప్పించింది. లువానా తమ క్రీడాకారుల దృష్టి మరల్చుతోందని స్వదేశానికి పంపించేసిందని వార్తలొచ్చాయి.

అయితే, ఒలింపిక్స్‌లో ఓడిపోయిన మర్నాడే స్విమ్మింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసింది. 

అంతేకాదు ‘నన్ను ఎవరూ ఒలింపిక్స్‌ నుంచి పంపలేదు, దయచేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దు’ అని ఓ ప్రకటనలో కూడా పేర్కొంది.  

 సోషల్‌ మీడియాలోనూ లువానా యాక్టివ్‌గా ఉంటుంది. స్విమ్మింగ్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తుంటుంది. ఆమె ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 8 లక్షల పైమాటే.  

లువానాకు బర్గర్‌ అంటే విపరీతమైన ఇష్టం. డైట్‌ నుంచి విరామం తీసుకున్నా, బయట ఎక్కడైనా బర్గర్‌ కనిపించినా తినకుండా ఉండలేదు. 

లువానాకు పక్షులంటే విపరీతమైన ఇష్టం. పక్షులతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ఉంటుంది. అన్నట్లు ఆమెకు ఒక పెంపుడు పక్షి ఉంది.

This browser does not support the video element.

 ఏ ప్రదేశానికైనా వెళ్తే.. అక్కడి ఆహారాన్ని ఇష్టంగా తింటుంది. దానికి తగ్గట్టుగా వ్యాయామాలు చేస్తుంది. అందమైన ప్రదేశాలను చుట్టి రావడం ఇష్టం.

ఇప్పుడు 900.. 1000 గోల్స్‌ నా కల..క్రిస్టియానో రొనాల్డో

పారాలింపిక్స్‌.. మనోళ్లు అదుర్స్‌

టెస్టు క్రికెట్.. బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిన జట్లు ఇవే

Eenadu.net Home