శోభిత.. బాలీవుడ్‌లో ఆంధ్ర గ్లామర్‌!

తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల.. ఈ మధ్య విడుదలైన తమిళ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌..’లో ‘వానతి’ పాత్రతో మెప్పించింది. 

(Photos: Instagram/Sobhita)

మరోవైపు బాలీవుడ్‌లో ‘ది నైట్‌ మేనేజర్‌’ వెబ్‌సిరీస్‌తో ఆకట్టుకుంది. తాజాగా ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’సీజన్‌ 2తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ తొలి సీజన్‌ హిట్‌ కావడంతో రెండో సీజన్‌ను రూపొందించి విడుదల చేశారు. ఇందులో శోభితదే ప్రధాన పాత్ర. 

అనురాగ్‌ కశ్యప్‌ తెరకెక్కించిన ‘రామన్‌ రాఘవ్‌ 2.0’తో వెండితెరకు పరిచయమైన శోభిత.. ‘గూఢచారి’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘మేజర్‌’లోనూ కీలక పాత్ర పోషించింది. 

‘మూతూన్‌’తో మలయాళంలో, ‘పొన్నియిన్‌..’తో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది. ప్రస్తుతం ‘మంకీమ్యాన్‌’చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టబోతోంది. 

నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శోభితకు కెరియర్‌ మొదట్లో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయట. 

మోడలింగ్‌ కోసం ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు.. కెమెరా ముందు అంత అందంగా లేవంటూ తన ముఖంపైనే చెప్పేవారట. 

మొదట మోడలింగ్‌లో, ఆ తర్వాత చిత్రసీమలో ఎన్ని అవమానాలు ఎదురైనా నిలదొక్కుకొని విజయాల్ని అందుకుంది.

‘నా దృష్టిలో అందమనేది ఎదుటి వారి ఆలోచనలకు సంబంధించిన విషయం. నా రూపాన్ని చూసి ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేశాను’అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home