మహేశ్-నమ్రత వెడ్డింగ్ డే.. అన్‌సీన్ పిక్స్ మీకోసం..
#eenadu
మహేశ్‌బాబు, నమత్రలు కలిసి చేసిన ఏకైక సినిమా ‘వంశీ’. ఆ షూటింగ్‌లోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు.
This browser does not support the video element.
మహేశ్ ప్రేమ పెళ్లివైపు అడుగులు వేయడానికి నాలుగేళ్ల సమయం పట్టింది. 2005లో వీరి వివాహం జరిగింది.
పెళ్లయిన కొత్తలో ఎంత సంతోషంగా ఉన్నామో ఎప్పటికీ అలాగే ఉంటామని, తమ జర్నీ సరదాగా, సంతోషంగా సాగిపోతుందని చెబుతుందీ జోడీ
పెళ్లి తర్వాత తామిద్దరూ ఫ్లాట్‌లో ఉన్న రోజులు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయంటారు నమ్రత. ఇక కొత్త ఇంటికి వచ్చాక ఆ ఆనందాలు రెట్టింపు అయ్యాయంటారు.
‘నమ్రత సింప్లిసిటీ అంటే నాకు ఇష్టం. ఏ సందర్భంలోనైనా తను తనలాగే ఉంటుంది. ముఖ్యంగా నెగెటివ్ ఆలోచనలు ఉండవు’ అంటారు మహేశ్.
‘అమాయకత్వం. సున్నిత మనస్కుడు. స్వచ్ఛమైన మనసు’ఇది మహేశ్ గురించి నమ్రత చెప్పే సింప్లీ ఆన్సర్.
‘మహేశ్, పిల్లలే నా ప్రపంచం. వీళ్లు కాకుండా వేరే ఆనందాలు ఏవీ అక్కర్లేదు’
‘మహేశ్ నుంచి నేను అందుకున్న బెస్ట్ గిఫ్ట్ నా పిల్లలు’
‘హ్యాపీ మ్యారేజ్ అనేది ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కోలా ఉంటుంది. సక్సెస్‌ఫుల్ రిలేషన్‌కి నమ్మకం, బలమైన స్నేహం ముఖ్యం’ -మహేశ్‌బాబు
‘ఒకరి మీద ఒకరికి నమ్మకం. స్నేహం, కుటుంబ బంధాల మీద.. మా రిలేషన్ ఆధారపడి ఉంది’-నమ్రత