#Eenadu

#Eenadu

కృష్ణవంశీతో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా నిర్మించాలనేది నిర్మాత రామలింగేశ్వరరావు కోరిక. ‘సముద్రం’ పూర్తయ్యాక ఆ పనిలోనే నిమగ్నమయ్యారు కృష్ణవంశీ.

ఆ చర్చల్లోనే.. ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులంతా అకాలమరణం చెందుతున్నారనే టాపిక్‌ వచ్చింది. దానికి శాపం కారణమని ఎవరో అనగా కృష్ణవంశీ ఆలోచనలో పడ్డారు. 

మహేశ్‌ ముగ్ధమనోహరంగా ఉంటాడు కాబట్టి బృందావనం కాన్సెప్టునకు శాపాన్ని జోడిస్తే బాగుంటుందనుకున్నారు.

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రేమకథ చేయాలనేది మహేశ్‌బాబు ఆలోచన. తప్పని పరిస్థితుల్లో ఓ రొమాంటిక్‌ స్టోరీ వినిపించారాయన. దానికి కృష్ణ, మహేశ్‌ ఓకే చెప్పారు.

ప్రేమకథను తెరకెక్కించడం కృష్ణవంశీకి ఇష్టంలేదు. దీంతో, ఎట్టకేలకు ముందు అనుకున్న స్టోరీకే మహేశ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

ఈ చిత్రానికి తొలుత అనుకున్న టైటిల్‌.. కృష్ణా ముకుందా మురారి


హీరోయిన్‌గా హేమమాలిని కుమార్తె ఈషా దేవోల్‌, వసుంధరా దాస్‌లో ఎవరో ఒకరిని అనుకున్నారు. చివరకు సోనాలి బింద్రే ఎంట్రీ ఇచ్చారు. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా.


బామ్మ పాత్రకు షాపుకారు జానకిని తీసుకోవాలని ఫిక్స్‌ అయినా డేట్లు సర్దుబాటు కాలేదు. మలయాళ నటి సుకుమారిని ఎంపిక చేశారు

జ్వరాన్ని లెక్కచేయకుండా ‘డుమ్‌ డుమ్‌ నటరాజు ఆడాలి’ పాటకు డ్యాన్స్‌, వాటర్‌ ఫైట్‌ చేశారు మహేశ్‌.

హాలీవుడ్‌ మూవీ ‘టెర్మినేటర్‌’లోని జైలు సన్నివేశం స్ఫూర్తితో ‘చెప్పమ్మా చెప్పమ్మా’ పాటలో ముగ్గు.. సోనాలీ బింద్రేలా మారేలా చిత్రీకరించారు 

రొటీన్‌కు భిన్నంగా క్లైమాక్స్‌కు ముందు ‘అలనాటి రామచంద్రుడు’ పాటను పెట్టారు. కట్‌చేస్తే, ఆ సాంగ్‌ ఎంత పాపులర్‌ అయిందో తెలిసిందే.

పీటర్‌ హెయిన్‌ ఫైట్‌ మాస్టర్‌గా ఈ సినిమాతో పరిచయమయ్యారు. కృష్ణవంశీ- ప్రకాశ్‌రాజ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఇదే పేరుతో తమిళ్‌లో డబ్‌ చేశారు. 

రూ. 55 లక్షలకు ఐదేళ్లపాటు తూర్పుగోదావరి జిల్లా పంపిణీ హక్కులు తీసుకున్న కృష్ణవంశీకి ఫస్ట్‌ రన్‌లో రూ. 1.3 కోట్ల వసూళ్లు దక్కించుకున్నారు 

అభిషేక్‌ హీరోగా హిందీలో ఈ సినిమా రీమేక్‌ చేయమని కృష్ణవంశీని అమితాబ్‌ అడిగారట. తుషార్‌ కపూర్‌తో రీమేక్‌ చేయాలని ఓ సంస్థ అనుకుందట. కానీ ఏదీ కాలేదు.

మహేశ్‌తోనే ఈ సినిమా రీమేక్‌ చేద్దామనుకున్నా అది సాధ్యపడలేదు. మురళి హీరోగా కన్నడలో ‘గోపి’ పేరుతో రీమేకైంది.

సెకండ్‌ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ (సిల్వర్‌), బెస్ట్‌ క్యారెక్టర్‌ యాక్ట్రెస్‌ (లక్ష్మి), స్పెషల్‌ జ్యూరీ (మహేశ్‌బాబు) విభాగాల్లో ఈ చిత్రానికి నంది అవార్డులు వరించాయి.

శోభన్‌ (వర్షం), నందినీ రెడ్డి (అలా మొదలైంది), శ్రీవాస్‌ (లక్ష్యం) ఈ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పని చేశారు. 

రీ రిలీజ్‌ విషయంలో తక్కువ సమయంలోనే రూ. 2 కోట్ల కలెక్షన్స్‌ (అడ్వాన్స్‌ బుకింగ్స్‌) రాబట్టిన సినిమాగా ‘మురారి’ రికార్డు సృష్టించింది

మగవాడు అంటేనే పగవాడు అంటోన్న రీతూ..

విమానాల హైజాక్‌.. ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావద్దు

నెట్టింట కొత్త పోస్టర్ల సందడి..

Eenadu.net Home