నయనతార బ్యానర్‌లో ‘మజ్ను’ లవర్
టాలీవుడ్‌లో ‘మజ్ను’తో ఎంట్రీ ఇచ్చి... తొలి ప్రయత్నంలోనే మెప్పించింది రియా సుమన్. ఇప్పుడు ‘వాకింగ్ టాకింగ్ స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్’తో అలరించడానికి సిద్ధమవుతోంది.
నయనతార రౌడీ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్‌లో ఈ సినిమాను వినాయక్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో రియా కేతిక అనే పాత్రలో కనిపించనుంది.
అభినవ్ గోమఠంతో కలసి కామెడీ ఎంటర్‌టైనర్ ‘కిస్మత్’తో సందడి చేసింది రియా.
‘మజ్ను’ తర్వాత ‘పేపర్ బాయ్’, ‘టాప్ గేర్’, ‘మెన్ టూ’ చిత్రాలతో ఆకట్టుకుంది.
రియా మహారాష్ట్రలో పుట్టింది. ముంబయిలో డిగ్రీ పూర్తి చేసింది.
చిన్నప్పట్నుంచే క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇష్టం. దీంతో భరతనాట్యం, కథక్‌లో శిక్షణ తీసుకుంది.
మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి నటిగా మారిన ఈ బ్యూటీ అంతకుముందు రైటర్‌గానూ పని చేసింది. ఇప్పటికీ కథలు రాస్తుంటుంది.
ఐస్‌క్రీమ్‌లూ, డిజర్ట్‌లు రియా ఫేవరెట్ ఫుడ్. నచ్చినవన్నీ లాగించేస్తూ... ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువ సమయం జిమ్ చేస్తుంది.
వీధుల్లో షాపింగ్ చేయడం నచ్చుతుంది. పండగల సమయంలో వీధి దుకాణాల వద్ద కొనుగోలు చేస్తుంటుంది.
This browser does not support the video element.
ఖాళీ సమయం దొరికితే స్విమ్మింగ్ చేస్తుంది. ఫిట్‌గా ఉండటానికి అదీ ఒక కారణమే అని ఫిట్‌నెస్ సీక్రెట్‌ని చెప్పింది.
‘‘అల్లం, యాలకులు వేసిన ఒక టీ ఉంటే చాలు. జీవితాంతం బతికేయొచ్చు. ఉదయాన్నే టీతోనే నా రోజును మొదలుపెడతాను’’ అంటుందీ ఛాయ్ లవర్.