ఆ ఫలానా అమ్మాయే.. మాళవిక!
‘ఎవడే సుబ్రమణ్యం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మాళవిక నాయర్.. త్వరలో ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించనుంది.
Image: Instagram/Malvika Nair
టాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్నా.. ఇప్పటి వరకు మాళవికకు సరైన హిట్ దక్కలేదు. ఈ చిత్రంతో అయినా విజయం అందుకోవాలని చూస్తోంది.
Image: Instagram/Malvika Nair
అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపించే మాళవిక.. దిల్లీలో జన్మించింది. ఆ తర్వాత ఈమె కుటుంబం కేరళలో స్థిరపడింది. తను మాత్రం దిల్లీ, హైదరాబాద్‌లో విద్యనభ్యసించింది.
Image: Instagram/Malvika Nair
చదువుకుంటున్న రోజుల్లోనే మోడలింగ్ చేస్తూ.. పలు బ్రాండ్స్ ప్రచార చిత్రాల్లో నటించింది. పదమూడేళ్ల వయసులోనే ‘ఉస్తాద్ హోటల్’తో తెరంగేట్రం చేసింది. పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది.
Image: Instagram/Malvika Nair
‘బ్లాక్ బట్టర్‌ఫ్లై’లో మాళవిక ప్రధాన పాత్ర పోషించడమే కాదు.. నటనతో ప్రేక్షకుల్ని, సినీవర్గాలను తనవైపు తిప్పుకొంది. అలా ‘కుకూ’తో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అందుకుంది.
Image: Instagram/Malvika Nair
ఇక తెలుగులో ‘ఎవడే సుబ్రమణ్యం’,‘కల్యాణ వైభోగమే’, ‘విజేత’, ‘టాక్సీవాలా’ తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. కీర్తి సురేశ్ ‘మహానటి’లోనూ కీలక పాత్ర పోషించింది. ‘మోడ్రన్ లవ్: హైదరాబాద్’ వెబ్‌సిరీస్‌లో మెరిసింది.
Image: Instagram/Malvika Nair
సినిమా ఎంపికలో చాలా జాగ్రత్త వహించే ఈ భామ.. పాత్ర బలంగా ఉంటేనే నటించేందుకు ఒప్పుకుంటానని చెబుతోంది.
Image: Instagram/Malvika Nair
తనకు గ్లామర్ రోల్స్‌లో నటించే ఉద్దేశం లేదని తెలిపిన మాళవిక.. బాలీవుడ్‌లో విద్యాబాలన్ నటన, ఎంచుకునే సినిమాలు బాగా నచ్చుతాయని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
Image: Instagram/Malvika Nair
కోలీవుడ్‌లో కమల్ హాసన్‌తో, మాలయాళంలో ఫాహద్ ఫాజిల్‌తో నటించాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం ‘అన్ని మంచి శకునములే’లో నటిస్తోంది.
Image: Instagram/Malvika Nair