కుర్రకారు ‘ప్రేమ’లు.. మమితా
మలయాళీ కుట్టి మమితా బైజు ‘ప్రేమలు’తో అలరిస్తోంది. రీను రాయ్ పాత్రలో ఆమె కుర్రకారు మనసు దోచేసింది.
రాజమౌళి, మహేష్ బాబు లాంటి స్టార్లు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా మమితను ఆకాశానికెత్తేస్తున్నారు.
కేరళలోని కొట్టాయంలో జన్మించిన మమిత కొచ్చిలో డిగ్రీ పూర్తి చేసింది. 2017లో ‘సర్వోపరి పలక్కరన్’తో పరిశ్రమలో అడుగుపెట్టింది.
ఇప్పటివరకూ 15 చిత్రాల్లో నటించింది. ఈ బ్యూటీకి కేరళలో మంచి ఫాలోయింగ్ ఉంది.
టాలీవుడ్‌లో పనిచేసే అవకాశమొస్తే రాజమౌళి సినిమాలో నటించాలనుందని చెప్పింది. ‘మగధీర’, ‘ఈగ’ను ఎన్నిసార్లు చూశానో అంటూ మురిసిపోతోంది.
‘‘అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఆయన సినిమాలన్నీ చూస్తాను. అల్లు అర్జున్‌తో కలిసి నటించే లక్కీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నా’’ అని చెప్పింది.
కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఈ భామ అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేసింది. పని ఏదైనా సరే అవుట్‌పుట్ ఎలా ఉందనేది చూసుకోవాలి అని అంటోంది.
This browser does not support the video element.
ఈ కేరళ కుట్టికి చీరకట్టు నచ్చుతుంది. చీరలో తీసుకున్న ఫొటోలే ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తాయి.
మమిత చిన్నప్పుడే కూచిపూడిలో శిక్షణ తీసుకుంది. స్కూలు, కాలేజీలో స్టేజీపై పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది.
స్నేహితులతో విహార యాత్రలకు వెళ్తుంది. బీచ్‌లో ఫ్రెండ్స్‌తో చేసిన అల్లరి వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
This browser does not support the video element.
క్లే ఆర్ట్ తన హాబీ. సమయం చిక్కితే బొమ్మలు చేయడం ఆమెకు అలవాటు.