‘ప్రిన్స్’కి జోడీ.. ఈ ఉక్రెయిన్ లేడీ!
టాలీవుడ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ స్టార్ శివకార్తికేయన్ నటించిన చిత్రం ‘ప్రిన్స్’. ఇందులో హీరోకి జోడీగా విదేశీ భామ మరియా ర్యాబోషప్క నటించింది.
Image: Eenadu
ఉక్రెయిన్‌కు చెందిన మరియా.. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ‘ప్రిన్స్’లో చక్కగా నటించింది. ఆమె నటనకు, డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
Image: Social media
మరియా ఉక్రెయిన్‌లోని కీవ్ నగరంలో 1997 మే 10న జన్మించింది. అక్కడే పుట్టి పెరిగింది.
Image: Social media
చిన్నప్పట్నుంచే మరియాకు నటనపై ఆసక్తి. దీంతో నటనలోనే డిగ్రీ చేసింది. ఆ తర్వాత మోడలింగ్‌లో అడుగుపెట్టింది.
Image: Social media
మోడలింగ్ చేస్తున్న క్రమంలో ఆమెకు సినిమా అవకాశం వచ్చింది. తొలిసారి ఉక్రెయిన్‌లోనే 2018లో విడుదలైన ‘ఈతర్’లో నటించింది మరియా.
Image: Social media
గతేడాది హిందీ వెబ్‌సిరీస్ ‘స్పెషల్ ఆప్స్ 1.5: ది హిమ్మత్ స్టోరీ’లో మరియా కీలక పాత్రలో మెరిసింది. ఆమె నటనను ప్రశంసిస్తూ భారత్ నుంచి అభినందనలు, అవకాశాలు వెల్లువెత్తాయి.
Image: Social media
ఈ క్రమంలోనే ‘ప్రిన్స్’ చిత్రబృందం మరియాను ఎంపిక చేసుకుంది. అలా ఉక్రెయిన్ భామ.. టాలీవుడ్, కోలీవుడ్‌లో హీరోయిన్‌గా మారింది.
Image: Social media
భారతీయ సినిమాలను చూస్తుంటానని మరియా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తనకు ‘3 ఇడియట్స్’ అంటే చాలా ఇష్టమని చెప్పింది.
Image: Social media
‘ప్రిన్స్’ షూటింగ్ కోసం మరియా భారత్‌కు వచ్చిన కొన్ని రోజులకే ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైంది. తన మాతృభూమిని చాలా మిస్ అవుతున్నానని పలు సందర్భాల్లో మరియా తెలిపింది.
Image: Social media
బాధలో ఉన్న తనను చిత్రబృందం ఎంతో ఆప్యాయంగా చూసుకుందని, షూటింగ్ ఎంతో సరదాగా సాగిపోయిందని తెలిపింది.
Image: Social media
త్వరలోనే తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లి దేశానికి తనవంతు సాయం చేయాలని ఉందని మరియా చెప్పుకొచ్చింది.
Image: Social media
ప్రస్తుతం తను ఇంకా వేరే సినిమాలను ఒప్పుకోలేదట. కానీ, అవకాశాలుంటే.. కచ్చితంగా భారతీయ సినిమాల్లో నటిస్తానని అంటోంది మరియా.
Image: Social media