మార్స్‌ ముచ్చట్లు!

మానవాళి నివసించేందుకు కాస్త అనువుగా ఉన్న గ్రహం అంగారక(మార్స్‌) గ్రహం. ఈ నేపథ్యంలో అక్కడి వాతావరణం, పరిస్థితుల్ని తెలుసుకునేందుకు ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు జరుగుతున్నాయి. 

Image: Nasa

అలా 1964 నవంబర్‌ 28న ప్రయోగించిన ‘మారినర్‌ 4’ అంతరిక్ష నౌక తొలిసారిగా మార్స్ మీదికి వెళ్లి వచ్చింది. అందుకే, నవంబర్‌ 28ని మార్స్‌డేగా జరుపుకొంటున్నాం.

Image: Nasa

ప్రస్తుతం మార్స్‌పై నాసా పంపించిన పెర్సెవరెన్స్‌ రోవర్‌ చక్కర్లు కొడుతూ.. అక్కడి పరిస్థితుల్ని శాస్త్రవేత్తలకు చేరవేస్తోంది.

Image: Nasa

అంగారక గ్రహానికి రోమన్‌ యుద్ధ దేవుడైన ‘మార్స్‌’ పేరును పెట్టారు. అక్కడి మట్టి ఎరుపు రంగులో ఉండటం వల్ల గ్రహం కూడా ఎర్రగా కనిపిస్తుంటుంది. అందుకే, దీన్ని ‘రెడ్‌ ప్లానెట్‌(ఎర్ర గ్రహం)అని కూడా పిలుస్తుంటారు. 

Image: Nasa

సౌర కుటుంబంలో సూర్యుడి దగ్గరి నుంచి నాలుగో గ్రహం ఇది. అతి చిన్న గ్రహాల్లో రెండోవది. మెర్క్యూరి మొదటిది. 

Image: Nasa

అంగారక గ్రహంపై చలి తీవ్రత.. భూమిపై కన్నా ఎక్కువగానే ఉంటుంది. గ్రహం మధ్యప్రాంతంలో ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియల్స్‌ ఉంటే.. ధ్రువాల్లో -140 డిగ్రీ సెల్సియల్స్‌ ఉంటుందట.

Image: Nasa

ఈ గ్రహంపై ఉన్న అగ్నిపర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి. అక్కడి ఒలింపస్‌ మాన్స్‌ అనే అగ్నిపర్వతం 24 కి.మీ ఎత్తు ఉంటుంది. ఇది మన ఎవరెస్ట్‌ పర్వతానికంటే మూడు రెట్లు ఎక్కువ. 

Image: Nasa

మార్స్‌పై మనం గెంతితే.. భూమిపై కంటే మూడు రెట్లు ఎక్కువ ఎత్తుకు వెళ్తామట. అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా బలహీనంగా ఉండటమే ఇందుకు కారణం. ఇక్కడ 100 పౌండ్ల బరువు అక్కడ 38 పౌండ్ల బరువుతో సమానం. 

Image: Nasa

భూమికి చంద్రుడిలా అంగారకుడికి రెండు ఉపగ్రహాలున్నాయి. వాటి పేర్లు ఫోబోస్‌, డీమోస్‌.

Image: Nasa

భూమిపై ఒక రోజు గడవడానికి 24 గంటలు పడితే.. అంగారకుడిపై 24 గంటల 37 నిమిషాలు పడుతుంది. ఇక్కడ ఏడాదికి 365 రోజులు ఉంటే, అక్కడ 687 రోజులుంటాయి. ఎందుకంటే సూర్యుడు చుట్టూ తిరగడానికి అంగారక గ్రహం ఎక్కువ సమయం తీసుకుంటుంది.

Image: Nasa

మొదట్లో ఈ గ్రహంపై రాళ్లు, మట్టి, ధూళి, మంచు ఉన్నట్లు కనిపెట్టారు. ఆ తర్వాత నీటి జాడనూ కనుగొన్నారు. 

Image: Nasa

చిత్రం చెప్పే విశేషాలు (23-04-2024/1)

ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ అంటే..

సత్యభామ వచ్చేస్తోంది..

Eenadu.net Home