‘హిట్‌’ కొట్టేసిన మీనాక్షి చౌదరి!

సుశాంత్‌ హీరోగా తెరకెక్కిన‘ఇచట వాహనములు నిలుపరాదు’తో తెలుగు తెరకు పరిచయమైంది మీనాక్షి చౌదరి.

Image: Instagram/Meenakshi Chaudhary

ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఈ బ్యూటీకి గుర్తింపు లభించింది.

Image: Instagram/Meenakshi Chaudhary

ఆ తర్వాత రవితేజ సరసన ‘ఖిలాడీ’లో మెరిసిన మీనాక్షి.. ఇప్పుడు అడవి శేష్‌తో ‘హిట్‌ 2’లో నటించి ఆకట్టుకుంది.

Image: Instagram/Meenakshi Chaudhary

హరియాణాకి చెందిన ఈ భామ 2018లో అందాల పోటీల్లో పాల్గొని మిస్‌ గ్రాండ్‌ ఇండియాగా, మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌లో రన్నరప్‌గా నిలిచింది.

Image: Instagram/Meenakshi Chaudhary

ఆ పాపులారిటీతో ఇండస్ట్రీ నుంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా ‘ఔట్‌ ఆఫ్‌ లవ్‌’ అనే బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌లో నటించింది. పలు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లోనూ ఆడిపాడింది.

Image: Instagram/Meenakshi Chaudhary 

తెలుగు ప్రేక్షకులు తనను ఇంతలా ఆదరిస్తారని ఊహించలేదంటూ మురిసిపోతోంది.

Image: Instagram/Meenakshi Chaudhary

డెంటల్‌ సర్జరీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన ఈ సుందరి.. రాష్ర్ట స్థాయి స్విమ్మర్‌, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కూడా.

Image: Instagram/Meenakshi Chaudhary

తరచూ ఫొటోషూట్లో పాల్గొని తన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంది.

Image: Instagram/Meenakshi Chaudhary

తనకు ఎక్కువగా రచనలు, ట్రావెలింగ్‌ అంటే ఇష్టమట. సమయం దొరికితే చాలు వివిధ ప్రాంతాల్లో చక్కర్లు కొట్టేందుకు సిద్ధమవుతుంది.

Image: Instagram/Meenakshi Chaudhary

ప్రస్తుతం విజయ్‌ ఆంటోనీతో కలిసి ‘కొలై’సినిమాలో నటిస్తోంది మీనాక్షి.

Image: Instagram/Meenakshi Chaudhary

సెల్ఫీ బ్యూటీస్‌

ఒంటికి యోగా మంచిదేగా..!

రష్మీ.. అనసూయ బాటలో కొత్త యాంకర్‌..

Eenadu.net Home