బుజ్జమ్మ.. ఎంత ముద్దుగున్నావమ్మా!
వరుణ్‌తేజ్ ‘గద్దలకొండ గణేష్’లో ‘బుజ్జమ్మ’గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి మృణాళిని రవి. ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది.
Image: Instagram/Mirnalini Ravi
ఇటీవల థియేటర్లలో విడుదలైన ‘ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు’లో సోహెల్‌కి జోడీగా నటించింది. తాజాగా ఈచిత్రం ఓటీటీలో విడుదలైంది.
Image: Instagram/Mirnalini Ravi
ఈ కోబ్రా బ్యూటీ.. పుదుచ్చేరిలో జన్మించింది. బెంగళూరులో ఇంజినీరింగ్ చదువుకుంది. ఐబీఎంలో ఉద్యోగం కూడా చేసింది.
Image: Instagram/Mirnalini Ravi
ఓ వైపు ఉద్యోగం చేస్తూనే అప్పట్లో మృణాళిని చేసిన టిక్‌టాక్, డబ్‌స్మాష్ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో పలువురు దర్శకులు సినిమాల్లో నటించమని అడిగారట.
Image: Instagram/Mirnalini Ravi
సినిమాల్లో నటించడానికి మొదట్లో మృణాళిని తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. నటనపై తనకున్న ఆసక్తిని వివరించి ఒప్పించడంతో నటిగా మారానని ఈ భామ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
Image: Instagram/Mirnalini Ravi
అలా త్యాగరాజన్ కుమారరాజా తెరకెక్కించిన ‘సూపర్ డీలక్స్(2019)’లో సహాయక పాత్ర పోషించింది మృణాళిని.
Image: Instagram/Mirnalini Ravi
అదే ఏడాది ‘గద్దలకొండ...’తో తెలుగులో, ‘ఛాంపియన్’తో తమిళ్‌లో హీరోయిన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Image: Instagram/Mirnalini Ravi
ఉద్యోగం చేస్తూనే మూడు సినిమాల్లో నటించిందట. ఆ తర్వాత కూడా అవకాశాలు వస్తుండటంతో ఉద్యోగం మానేసి షూటింగ్స్‌తో బిజీ అయిపోయింది.
Image: Instagram/Mirnalini Ravi
కోలీవుడ్‌లో ఇప్పటి వరకు ‘ఎనిమీ’, ‘ఎంజీఆర్ మాగన్’, ‘జాంగో’, ‘కోబ్రా’లో నటించింది.
Image: Instagram/Mirnalini Ravi
రెండేళ్ల తర్వాత ‘ఆర్గానిక్ మామ..’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ప్రస్తుతం సుధీర్‌బాబు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ‘మామ మశ్చీంద్ర’లో నటిస్తోంది.
Image: Instagram/Mirnalini Ravi
మృణాళినికి సీరియస్ జోనర్ చిత్రాల్లో నటించడం ఇష్టముండదట. అలాంటి కథల్లో నటించే అవకాశమొస్తే నిరాకరించిందట.
Image: Instagram/Mirnalini Ravi
కామెడీ, జాయ్‌ఫుల్ సినిమాల్లో నటించడమే తనకు ఇష్టమని అంటోంది మృణాళిని.
Image: Instagram/Mirnalini Ravi
సోషల్‌మీడియాలోనూ ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో 1.3 మిలియన్ నెటిజన్లు ఈమెను ఫాలో అవుతున్నారు.
Image: Instagram/Mirnalini Ravi