లీల... ది ‘లవ్ గురూ’ వైఫ్
‘గద్దల కొండ గణేష్’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మృణాళిని రవి ఇప్పుడు ‘లవ్ గురు’లో విజయ్ ఆంటోనీకి భార్యగా వచ్చింది.
తమిళంలో ‘రోమియో’గా వచ్చిన ఈ సినిమా తెలుగులో ‘లవ్ గురు’గా మారింది. లీల పాత్రలో మృణాళిని అలరిస్తోంది.
‘గద్దలకొండ గణేశ్’తోపాటు ఒకే ఏడాది తమిళంలో ‘సూపర్ డీలక్స్’, ‘ఛాంపియన్’ సినిమాలు చేసింది. ఆ తర్వాత ‘ఎనిమీ’, ‘ఎంజీఆర్ మగన్’, ‘జాంగో’, ‘కోబ్రా’ సినిమాలు చేసింది. తెలుగులో ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’, ‘మామా మశ్చీంద్ర’లోనూ మెరిసింది.
‘పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ప్రతి విషయంలోనూ నా తల్లిదండ్రుల ప్రమేయం ఉండేది. కథ దగ్గరి నుంచీ ప్రతిదీ వాళ్లనడిగే నిర్ణయం తీసుకునేదాన్ని. ఇప్పుడు నేనే ఎంపిక చేసుకుంటున్నాను’ అని చెప్పింది.
This browser does not support the video element.
మృణాళినికి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించడం ఇష్టం. కథానాయికకి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రలైతే వెంటనే ఓకే చేస్తానంటోంది.
‘లవ్ గురు’లో లీల పాత్ర ఎంతో నచ్చిందని, కథ మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంటుందని... అందుకే ఓకే చేశా అని చెప్పింది.
ఈ భామకు చీరలు ధరించడమంటే ఎక్కువ ఇష్టం. ఇన్‌స్టాలోనూ ఆ ఫొటోలే ఎక్కువగా కనిపిస్తాయి.
మృణాళినికి భక్తి ఎక్కువే.. తరచూ ఆలయాలకు వెళుతుంది. అన్నదాన కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంది.
This browser does not support the video element.
స్నేహితులను కలిసిందంటే... రీల్స్ మీద రీల్స్ చేసి ఎంజాయ్ చేస్తుంటుంది. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది.