మీర్జాపూర్‌ గర్ల్‌.. హర్షితా గౌర్‌

‘మీర్జాపుర్‌’తో ఫేమస్‌ అయిన మరో బ్యూటీ హర్షిత గౌర్‌. వరుస సీజన్లలో ‘డింపీ పండిట్‌’గా అలరించిన ఇప్పుడు మూడో సీజన్‌లోనూ కనిపించనుంది. 

బాలీవుడ్‌లో 2018లో ‘అమన్‌’తో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ. ‘ఫలక్‌నుమా దాస్‌’, ‘ఆకాశ వీధుల్లో’తో టాలీవుడ్‌లోనూ అలరించింది.

హర్షిత 1992లో దిల్లీలో పుట్టింది. నోయిడాలోని అమిటీ యూనివర్శిటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. ఈమె కుటుంబంలోని వారంతా వైద్యులే. తనకు మాత్రం నటి అవ్వాలనే కోరిక ఉండేదట. 

ఇంజినీరింగ్‌ చేస్తున్న సమయంలోనే మోడలింగ్‌తో కెరీర్‌ మొదలుపెట్టింది. ఓ ప్రకటన ద్వారా సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది.

హర్షిత నృత్యకళాకారిణి కూడా. కథక్‌ నాట్యంలో శిక్షణ తీసుకుంది. దేశం మొత్తం మీద అనేక చోట్ల స్టేజీ పెర్ఫార్మెన్స్‌లు ఇచ్చింది.

హిందీలో 2013లో బుల్లితెరపై ‘సద్దా హఖ్‌’లో కనిపించింది. ఈ సీరియల్‌ దాదాపు మూడేళ్ల పాటు కొనసాగింది. ఆ సీరియల్‌తో అభిమానుల్ని సంపాదించుకుంది. 

వరుస అవకాశాలు వచ్చినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ, ‘మీర్జాపూర్‌’తో ఫేమస్‌ అయ్యింది.

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు కఠినమైన ఆసనాలు, వ్యాయామాలు చేస్తుంటుంది. స్విమ్మింగ్‌ చేయడమంటే ఈ భామకు మహా సరదా. 

తరచూ ఫొటోషూట్లో పాల్గొని ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది. ఆమె గ్లామర్‌కి కుర్రకారు ఫిదా అయిపోతోంది.    

This browser does not support the video element.

ప్రకృతిలోనే ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంది. ఫ్రెండ్స్‌తో కలసి విహారయాత్రలకు వెళ్తుంది. వారితో రీల్స్‌ చేసి నెట్టింట సందడి చేస్తుంటుంది. 

2025.. పాన్‌ ఇండియా ఇయర్‌!

కల్ట్‌ లవ్‌స్టోరీ సీక్వెల్‌లో నెరు నటి

కిస్సిక్‌తో క్రేజ్.. ఎవరీ ఊర్వశి అప్సర

Eenadu.net Home