నిషా కన్నుల.. మిశా నారంగ్
ఆది సాయికుమార్ హీరోగా.. ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీ.ఎస్.ఐ. సనాతన్’. ఇందులో మిశా నారంగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Image: Instagram/Misha Narang
ఈ భామ పుట్టిన రోజు జనవరి 19న చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ విడుదల చేసింది.
Image: Instagram/Misha Narang
హరియాణాలో జన్మించిన మిశా.. ఎం.ఎస్సీ(కెమిస్ట్రీ) చదివింది. కానీ, నటనపై ఆసక్తితో సినీరంగంలోకి వచ్చింది.
Image: Instagram/Misha Narang
సినిమాల్లో నటించాలని హరియాణా నుంచి ముంబయికి చేరుకొని ప్రయత్నాలు మొదలుపెట్టింది.
Image: Instagram/Misha Narang
దర్శకుడు శ్రీని జోస్యుల తెరకెక్కించిన ‘మిస్సింగ్’తో మిశాకు టాలీవుడ్ అవకాశం దక్కింది. కానీ, ‘తెల్లవారితే గురువారం’తో ప్రేక్షకులకు పరిచయమైంది.
Image: Instagram/Misha Narang
‘మిస్సింగ్’ చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఈమెకు ‘తెల్లవారితే...’ చిత్రబృందం నుంచి పిలుపొచ్చిందట. పాత్ర నచ్చి నటించగా.. ముందుగా ఈ సినిమానే విడుదలైంది.
Image: Instagram/Misha Narang
‘తెల్లవారితే...’లో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహా హీరో. ఇందులో మిశా నటనకు మంచి గుర్తింపు రావడంతో తెలుగుతోపాటు కోలీవుడ్ నుంచి అవకాశాలు క్యూ కట్టాయి.
Image: Instagram/Misha Narang
ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘సీ.ఎస్.ఐ...’తోపాటు తమిళ్‌లో ‘తుడిక్కుమ్ కారంగల్’, ‘తడై ఉడై’లో నటిస్తోంది.
Image: Instagram/Misha Narang
మిశాకు హీరోయిన్లలో కాజల్ అగర్వాల్, హీరోల్లో విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమట. విజయ్‌తో నటించాలని ఉందంటూ తన మనసులోని మాటను గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
Image: Instagram/Misha Narang