మిస్తీ మళ్లీ వస్తోంది..! 

‘చిన్నదాన నీకోసం’తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటి మిస్తీ చక్రవర్తి. చాలా కాలం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. 

Image: Instagram/mishtichakravarty

ఆర్యన్‌ హీరోగా.. దర్శకురాలు దివ్య భావన తెరకెక్కిస్తోన్న ‘ఓ సాథియా’లో మిస్తీ హీరోయిన్‌గా నటిస్తోంది. జులై 7న ఈ చిత్రం విడుదల కానుంది. 

Image: Instagram/mishtichakravarty

తెలుగులో చాలా సినిమాలు చేసినా.. ఈ బ్యూటీకి ఆశించినంత సక్సెస్‌ రాలేదు. దీంతో అవకాశాలూ దూరమయ్యాయి. ఇప్పుడు తన ఆశలన్నీ ‘ఓ సాథియా’పైనే ఉన్నాయి.

Image: Instagram/mishtichakravarty 

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన మిస్తీ అసలు పేరు.. ఇంద్రాణీ చక్రవర్తి. యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కతాలో ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేసింది. 

Image: Instagram/mishtichakravarty

కాలేజ్‌లో చదువుతున్నప్పుడే మోడలింగ్‌ చేసేది. ఈమె ఫొటోలు చూసి బాలీవుడ్‌ దర్శకుడు సుభాష్‌ ఘాయ్‌ అవకాశమిచ్చారు.

Image: Instagram/mishtichakravarty

అలా 2014లో ‘కాంచీ: ది అన్‌బ్రేకబుల్‌’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ చిత్రంతోనే తన పేరును మిస్తీ చక్రవర్తిగా మార్చుకుంది. 

Image: Instagram/mishtichakravarty

నితిన్‌ ‘చిన్నదాన..’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ‘కొలంబస్‌’, ‘బాబు బాగా బీజీ’, ‘శరభ’, ‘బుర్ర కథ’ తదితర చిత్రాల్లో నటించింది. ఇవేవీ మిస్తీకి పెద్దగా గుర్తింపునివ్వలేదు.

Image: Instagram/mishtichakravarty

పలు తమిళ్‌, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ మెరిసిన ఈ బ్యూటీ 2019 తర్వాత వెండితెరపై కనిపించలేదు. 

Image: Instagram/mishtichakravarty

ఇండస్ట్రీలో ఆడిషన్స్‌ ఎలా, ఎప్పుడు జరుగుతాయో అవగాహన లేకపోవడం వల్లే సినిమాలకు గ్యాప్‌ వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

Image: Instagram/mishtichakravarty

ఇప్పుడు మళ్లీ కొత్తగా ప్రయాణం మొదలుపెట్టానని.. ఈ క్రమంలోనే సోషల్‌మీడియా ద్వారా సినీ ప్రేక్షకులకు చేరువవుతున్నానని తెలిపింది. 

Image: Instagram/mishtichakravarty

ప్రస్తుతం కోలీవుడ్‌, బాలీవుడ్‌లో ఒక్కో చిత్రంలో నటిస్తోందట. మరో మూడు కథలు చర్చల దశలో ఉన్నాయని మిస్తీ వెల్లడించింది. 

Image: Instagram/mishtichakravarty

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home