మిస్ ఆసియా గ్లోబల్ తమన్నా గురించి మీకు తెలుసా?


మిస్ ఆసియా గ్లోబల్ 2024 అందాల పోటీలో మన దేశానికి చెందిన తమన్నా భరత్‌ కిరీటాన్ని దక్కించుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకి చెందిన అందగత్తెలు ఈ పోటీలో పాల్గొన్నారు. 

తమన్నా భరత్‌ ఈ ఏడాది కేరళలో జరిగిన ‘మిస్‌ నేవీ ముంబయి 2024’ కిరీటాన్నీ గెలుచుకుంది.

మహారాష్ట్రకి చెందిన తమన్నా‘2024 మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా’ మొదటి రన్నరప్‌గానూ నిలిచింది. 

ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యమిచ్చే తమన్నాకి ఇంట్లో చేసే పాస్తా, పావ్‌బాజీ, శాండ్‌విచ్‌ అంటే ఇష్టం.

స్నేహితులతో కలసి దేశంలోని చారిత్రాత్మక కట్టడాలను చుట్టేయడం ఆమెకు ఇష్టం.

మోడ్రన్‌ దుస్తుల్లో క్యాట్‌వాక్‌ చేయడమే కాదు.. గరిటె పడితే రుచికరంగానూ వండగలదు.

గ్లామర్ రంగంలోకి రావడానికి స్ఫూర్తి భారత తొలి మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్ అని చెప్పింది.

This browser does not support the video element.

తమన్నా మోడల్ మాత్రమే కాదు.. క్లాసికల్‌, వెస్ట్రన్‌ డ్యాన్సర్‌ కూడా. ఖాళీ సమయంలో అమ్మతో కలసి స్టెప్పులు వేస్తుంది. అంతేకాదు అమ్మే నా బెస్ట్‌ డ్యాన్స్ పార్ట్‌నర్‌ అని చెప్పింది.

‘మోడలింగ్‌లో రాణించాలంటే ప్రతిభతో పాటూ సంకల్పమూ ఉండాలి. అవే మనల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాయి’ అని సక్సెస్‌ సీక్రెట్ చెప్పింది.

రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఈ పానీయాలు ట్రై చేయండి

నలుపు.. అందాల మెరుపులు

ఒత్తిడిని దూరం చేసే ఆయిల్‌ మసాజ్‌

Eenadu.net Home