విశ్వ సుందరి బరిలో మన శ్వేత

This browser does not support the video element.

శ్వేతా శార్దా ఈ పేరు విన్నారా..! ఎల్‌ సాల్వడార్‌లోని శాన్‌ సాల్వడార్‌లో నవంబరు 19న జరగనున్న 72వ మిస్‌ యూనివర్స్‌ పోటీలకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది. 

ఈ 23 ఏళ్ల సుందరి స్వస్థలం చండీగఢ్‌. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి వద్దే పెరిగింది. చదువుకోవడానికి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. తల్లిపడే కష్టాన్ని అర్థం చేసుకొని పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం చిన్నప్పట్నుంచే అలవాటు చేసుకుంది.

మోడలింగ్‌పై ఆసక్తితో 16ఏళ్ల వయసులో తల్లితో పాటు ముంబయికి వచ్చేసింది. డ్యాన్సర్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. ‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌’, ‘డ్యాన్స్‌ దివానే’, ‘డ్యాన్స్‌ ప్లస్‌’ వంటి రియాలిటీ షోల ద్వారా బుల్లితెరకు పరిచయమైంది.

ఇంటర్ పూర్తైన తర్వాత దూర విద్యలో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసింది. డ్యాన్సర్‌గానే కాదు డ్యాన్స్‌ మాస్టర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. ఝలక్‌ దిఖ్లాజా షోకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించింది. పలు మ్యూజిక్‌ వీడియోల్లోనూ కనిపించింది.

‘సుస్మితా సేన్‌ 1994లో విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంది. ఆమెనే స్ఫూర్తిగా తీసుకొని అందాల పోటీల్లో పాల్గొనాలనుకున్నా. ఆమె లాగే కిరీటం గెలుచుకోవాలనుకున్నా. ఈ ఏడాది ‘మిస్‌ దివా యూనివర్స్‌’ టైటిల్‌ గెలవడం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.’ - శ్వేతా శార్దా

వెనకబడిన ప్రాంతాల అమ్మాయిలకు ఇంట్లోనూ, సమాజంలోనూ ప్రోత్సాహం దొరకట్లేదు. అలాంటి వారికి విద్య గురించి అవగాహన కల్పించడంతో పాటు, వారికి ఆత్మరక్షణ విద్య నేర్పుతూ ఆదర్శంగా నిలుస్తుంది శార్దా.

‘ఏదైనా సాధించాలని కలలు కనే ప్రతి అమ్మాయికి ప్రోత్సాహం ఎంతో అవసరం. నా అడుగడుగునా అమ్మ తోడుగా ఉంది. తనకి సొంతిల్లు లేదని బాధ పడుతుంది. త్వరలోనే తన కోరికను తీరుస్తా’ అని అంటోంది శార్దా.

‘ఆత్మనిర్భర్‌’ అనే ప్రాజెక్టులో భాగంగా ఒంటరి మహిళలకు, అమ్మాయిలకు ధైర్యాన్నిచ్చి.. వారితో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించి ఆసరాగా నిలుస్తోంది.

డ్యాన్స్‌, ట్రావెలింగ్‌, యాక్టింగ్‌ అంటే ఈ బ్యూటీకి చాలా ఇష్టం. పెంపుడు జంతువులంటే ఈ భామకి ఎంతో ఇష్టం. ఇన్‌స్టాలోనూ వాటి ఫొటోలు ఎక్కువగానే ఉంటాయి. 

This browser does not support the video element.

‘డ్యాన్స్‌ చేయడం అంటే కేవలం కాళ్లూ చేతులు కదపడం కాదు మన తనువంతా పులకించాలి. డ్యాన్స్‌ కేవలం నాకు ఇష్టం మాత్రమే కాదు.. ప్యాషన్‌ కూడా అదే’ అంటుందీ మిస్‌ దివా.

‘వరల్డ్స్‌ లోన్లీయెస్ట్‌ హౌస్‌’ గురించి తెలుసా?

కళ్ల కింద నల్లటి వలయాలు ఇలా మాయం!

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

Eenadu.net Home