డాక్టరమ్మకు అందాల కిరీటం!
శృతి హెగ్డే ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన పేరు. ఇంతకీ ఎవరీమె అంటారా..! మిస్ యూనివర్సల్ పెటైట్ కిరీటాన్ని అందుకున్న డాక్టరమ్మ.
అయిదడుగుల ఆరంగుళాలు లేదా అంతకన్నా తక్కువ ఎత్తుండే అమ్మాయిల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ‘మిస్ యూనివర్సల్ పెటైట్’ కిరీటం అందుకొని.. ఈ అందాల పోటీ గెలిచిన తొలి భారతీయురాలిగా శృతి హెగ్డే చరిత్ర సృష్టించింది.
కర్ణాటకకు చెందిన ఈమె డాక్టర్‌గా పనిచేస్తోంది. మోడలింగ్‌పై ఇష్టంతో సరదాగా ప్రయత్నిద్దామని 2018లో అందాల పోటీల్లో పాల్గొంది.
అప్పట్లో మిస్ ధారవాడ్ కంటెస్ట్‌గా నిలిచింది. ఇందులో గెలిచిన తర్వాతే అందాల పోటీలకు సీరియస్‌గా ప్రయత్నించడం మొదలుపెట్టానంటోంది.
బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఓ ఆసుపత్రిలో ఇంటర్న్‌గా చేస్తూ, డెర్మటాలజీలో ఎండీ చేస్తోంది శృతి. ‘జీవితాన్ని బోరింగ్‌గా గడపడం ఇష్టం ఉండదు కాబట్టే ఇన్ని పనులపైనా శ్రద్ధ పెట్టగలుగుతున్నా’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
ఓ వైపు వృత్తిలో రాణిస్తూనే.. అందాల పోటీల కోసం శ్రమించేది. జీవితాన్ని ఎప్పుడూ ఒకే విధంగా చూడటం ఈమెకి నచ్చదట. కొత్త ప్రయత్నాలు చేస్తూ మరిన్ని నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి సారిస్తూ ఉంటుంది.
This browser does not support the video element.
అందాల పోటీలు అంటే కేవలం నడక, డ్రెస్సులు, అందం మాత్రమే కాదు... సమయస్ఫూర్తి, ధైర్యం, తెగింపు అన్నీ ఉండాలనే విషయం ఈ ప్రయాణంలో నేర్చుకున్నానని చెబుతోంది.
అందాల పోటీల వల్ల నటనలోనూ అవకాశాలొచ్చాయి. సీరియల్స్ ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
‘శరనార శక్తి’లో నటించిన తర్వాత చిత్ర పరిశ్రమపై సానుకూల ధోరణి ఏర్పడిందట. ప్రస్తుతం ‘జనుమదత్త’లో నటిస్తోంది.
This browser does not support the video element.
సంప్రదాయ నృత్యంలోనూ ఈమెకు ప్రావీణ్యం ఉంది. స్టేజీ ప్రదర్శనలూ ఇస్తుంటుంది. సౌందర్య ఉత్పత్తులకు ప్రచారకర్తగానూ వ్యవహరిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. రీల్స్, ఫొటోషూట్లతో సందడి చేస్తుంటుంది.