మిస్ వరల్డ్ క్రిస్టినా..
మిస్ వరల్డ్ - 2024లో 111 దేశాలకు చెందిన భామలు పాల్గొంటే ఆ కిరీటం చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవాకు దక్కింది.
ముంబయి వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో 25 ఏళ్ల క్రిస్టినా 71వ మిస్‌వరల్డ్‌గా నిలిచింది.
ట్రినెక్ (చెక్ రిపబ్లిక్)లో 1999లో జన్మించిన క్రిస్టినా చార్లెస్ యూనివర్సిటీలో లా చదివింది. ఇప్పుడు ఎంసీఐ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తోంది.
మిస్ చెక్ రిపబ్లిక్ 2022 టైటిల్ గెలిచిన తర్వాత మోడలింగ్ కెరీర్‌ని ఎంచుకుంది. 2023లో మిస్‌వరల్డ్ పోటీలకు ఆ దేశం నుంచి ప్రాతినిథ్యం వహించడానికి ఎంపికైంది.
ఆ దేశం నుంచి మిస్‌వరల్డ్‌గా నిలిచిన రెండో మహిళ క్రిస్టినా. అంతకు ముందు టనానా కుచారోవా 2006లో విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంది.
క్రిస్టినాకు సామాజిక బాధ్యత ఎక్కువే. ‘క్రిస్టినా పిస్కో ఫౌండేషన్’ స్థాపించి.. అనాథలకు సాయం చేస్తోంది.
This browser does not support the video element.
అందరికీ విద్య అందాలని, పేద విద్యార్థుల కోసం స్వచ్ఛందంగా ఓ పాఠశాలను ప్రారంభించింది. ‘ఈ పాఠశాల నిర్మాణం నా జీవితంలో గర్వించదగ్గ విషయం’ అని చెబుతోంది.
This browser does not support the video element.
గుర్రాలను పెంచుకోవడం ఇష్టం. అలాగే హార్స్ రైడింగ్ కూడా. గుర్రాలతో దిగిన ఫొటోలను, రైడింగ్ వీడియోలను ఇన్‌స్టాలో ఎక్కువగా షేర్ చేస్తుంటుంది.
‘కుటుంబ సభ్యులు, స్నేహితులు లేకపోతే ట్రిప్‌ని ఎంజాయ్ చేయలేం. ఎక్కడికెళ్లినా ఎవరో ఒకర్ని వెంట తీసుకెళ్తా. బీచ్‌లో ఆడుకోవడం అంటే భలే సరదా’ అంటోంది విశ్వసుందరి.
క్రిస్టినాకి సంగీతం అంటే మహా ఇష్టం. వయొలిన్ కూడా ప్లే చేస్తుంది. ప్రశాంతతను సూచించే తెలుపు రంగు నచ్చుతుంది.