మోహన రంగ.. అందం అదిరిందిగా

‘పుష్ప’ ఫేమ్‌ జగదీశ్‌ ప్రతాప్‌ హీరోగా నటించిన ‘సత్తిగాని రెండెకరాలు’ తాజాగా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాతో మరో హీరోయిన్‌ తెలుగు తెరకు పరిచయమైంది. తనే మోహన శ్రీ సురాగ.

Image: Instagram/Mohana Sree Suraaga

ఎవరైనా తొలి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకునేలా గ్లామర్‌ పాత్రలు చేయాలనుకుంటారు. కానీ, మోహన దానికి భిన్నమైన పాత్ర పోషించింది.

Image: Instagram/Mohana Sree Suraaga

ఈ సినిమాలో మోహన.. సత్తి పాత్రకు భార్యగా.. ఇద్దరు పిల్లలకు తల్లిగా.. కాస్త డీగ్లామరస్‌గా కనిపించింది.

Image: Instagram/Mohana Sree Suraaga

సినిమాలో ఈ పాత్ర గురించి తెలిసి చాలా మంది తనను నటించొద్దని చెప్పారట. కానీ, కథపై నమ్మకంతో సినిమా చేసినట్లు మోహన ట్రైలర్‌ లాంచ్‌వేడుకలో తెలిపింది. 

Image: Instagram/Mohana Sree Suraaga

తమిళనాడుకు చెందిన మోహన.. చక్కగా తెలుగులో మాట్లాడుతోంది. తన స్పీచ్‌కు అందరూ ఫిదా అయ్యారు.

Image: Instagram/Mohana Sree Suraaga

మోహన చదువు పూర్తికాగానే ఫ్యాషన్‌ డిజైనర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో ఎంతో మంది సెలబ్రిటీలకు ఫ్యాషన్‌ దుస్తులు రూపొందించింది.

Image: Instagram/Mohana Sree Suraaga

నటనపై ఆసక్తి ఉండటంతో సినీ అవకాశాల కోసం ప్రయత్నించగా ‘సత్తిగాని రెండెకరాలు’లో హీరోయిన్‌గా అవకాశమొచ్చింది. 

Image: Instagram/Mohana Sree Suraaga

తొలి సినిమాతోనే మోహన.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

Image: Instagram/Mohana Sree Suraaga

సినిమాలో గ్రామీణప్రాంత సాధారణ గృహిణిగా కనిపించిన ఈ భామ.. బయట మాత్రం అందంతో ఆకట్టుకుంటోంది.

Image: Instagram/Mohana Sree Suraaga

సోషల్‌మీడియాలో మోహన యాక్టివ్‌గానే ఉంటుంది. తన గ్లామర్‌ ఫొటోలు, చిత్ర విశేషాలు షేర్‌ చేస్తుంటోంది.

Image: Instagram/Mohana Sree Suraaga

నెక్సా వేదికపై అందాల తారలు..

‘సరిపోదా శనివారం’లో తమిళ నటి

మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్స్‌

Eenadu.net Home