మృణాల్‌... పుస్తకాల పురుగు

This browser does not support the video element.

‘సీతారామం’ తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్‌ ఇచ్చి ‘హాయ్‌ నాన్న’తో తెలుగు తెరపై మెరిసింది మృణాల్‌. ‘యష్నా’గా అందం, అభినయంతో ఆకట్టుకుంది. 

‘హాయ్‌ నాన్న’తో మనసుల్ని కదిలించిన మృణాల్‌ ఠాకూర్‌ ఇప్పుడు విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీస్టార్‌’తో మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. పరుశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. 

‘‘కెరీర్‌ ప్రారంభించి పదేళ్లు దాటినా.. ఇంకా తొలి రోజుల్ని మర్చిపోలేదు. చాలామందిలా ఒకప్పుడు నేనూ బాడీ షేమింగ్‌కు గురయ్యాను’’ అంటూ నాటి రోజుల్ని గుర్తు చేసుకుంది.

‘అందంగా లేవు.. గ్లామర్‌ పాత్రల్లో అయితే ఊహించడం కష్టమే’ అని ముఖం మీదే చెప్పేసేవారట. మన మీద మనకు నమ్మకం ఉంటే దేన్నైనా సాధించగలం అని నమ్మి సినిమాల్లో కొనసాగింది.

నలుపు రంగు అంటే ఎంతో ఇష్టం. ఇన్‌స్టాలోనూ ఈ రంగు దుస్తులతో ఉన్న ఫొటోలే ఎక్కువగా ఉంటాయి. అన్నట్టు ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్ల సంఖ్య 11 కోట్లకు పైమాటే!

దగ్గరి వారు ఆమెను గోలి అని పిలుస్తారు. చిన్నప్పట్నుంచే కథలు, పుస్తకాలు చదివే అలవాటు ఉంది. అందుకే స్నేహితులు పుస్తకాల పురుగు అనేవారట.

సీఫుడ్ అంటే చాలా ఇష్టం. చేపలు, రొయ్యలు ఎక్కువగా తింటుంది. సల్మాన్‌ ఖాన్‌కు వీరాభిమాని. ‘ఆయన సినిమాలు ఎన్ని సార్లు చూసినా బోర్‌ కొట్టవు’ అంటుంటుంది.

మృణాల్‌ జంతు ప్రేమికురాలు. వీటి గురించి ఎక్కడైనా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తే మద్దతుగా నిలుస్తుంది. 

This browser does not support the video element.

ఖాళీ సమయాల్లో సినిమాలే చూస్తుందట. ప్రకృతిని ఆస్వాదించడానికి అప్పుడప్పుడు విహారయాత్రలకు ప్లాన్‌ చేస్తుంది. షాపింగ్‌, డ్యాన్స్‌ తన హాబీలు.

పంచదార స్వీట్లకు చాలా దూరం. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహార పదార్థాలు... తాజా పండ్లు, కూరగాయలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంది.

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home