సై.. అంటోంది ‘ఇస్మార్ట్‌’ అందం!

పూరీ జగన్నాథ్‌-రామ్‌‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో టాలీవుడ్‌ గ్లామరస్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.. నభా నటేశ్‌. కానీ, గత కొంతకాలంగా సినిమాలు చేయట్లేదు. 

Image: Instagram/Nabha Natesh

గతేడాదిలో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కారణమేంటంటే.. ఓ ప్రమాదంలో నభా తీవ్రంగా గాయపడింది. ఆమెకు పలు సర్జరీలు జరిగాయి.

Image: Instagram/Nabha Natesh 

ఈ విషయాన్ని ఇటీవల సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. తన ఎడమ భుజం ఫ్రాక్చర్‌ అయిందని, కొన్ని నెలలపాటు చికిత్స తీసుకొని.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నానని తెలిపింది.

Image: Instagram/Nabha Natesh

సినిమా అవకాశాలు వస్తే.. మళ్లీ వెండితెరపై మెరిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తన పోస్టు ద్వారా చెప్పకనే చెప్పింది.

Image: Instagram/Nabha Natesh

తనకు గాయాలైన విషయం బయటపడకుండా ఇన్నాళ్లు నభా జాగ్రత్త పడింది. సినిమాలకి దూరమైనా.. తరచూ ఇన్‌స్టాలో తన ఫొటోలు పోస్టు చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంది.

Image: Instagram/Nabha Natesh

టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న ఈ కన్నడ భామ.. 1996 నవంబర్‌ 11న శృంగేరిలో జన్మించింది. ఉడిపిలో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ చేసింది. 

Image: Instagram/Nabha Natesh

చదువుకుంటూనే మోడలింగ్‌ చేస్తూ.. నటనలో శిక్షణ తీసుకుంది. పలు స్టేజి నాటకాల్లోనూ పాల్గొనేది.

Image: Instagram/Nabha Natesh

తన 19వ ఏటనే శివరాజ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కిన ‘వజ్రకాయ’లో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.

Image: Instagram/Nabha Natesh

సుధీర్‌బాబు నటించిన ‘నన్ను దోచుకుందువటే’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది నభా. అదే ఏడాది ‘అదుగో’లో నటించింది.

Image: Instagram/Nabha Natesh

తన అందం, అభినయంతో తొలిసినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.. దాంతో అవకాశాలు క్యూ కట్టాయి. 

Image: Instagram/Nabha Natesh

అలా వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో నభా బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ కొట్టింది. గ్లామర్‌ రోల్‌లో కనిపించి కుర్రాళ్లను ఆకట్టుకుంది.

Image: Instagram/Nabha Natesh 

అదే జోరులో ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్‌’, ‘అల్లుడు అదుర్స్‌’, ‘మాస్ట్రో’లో నటించి మెప్పించింది. 

Image: Instagram/Nabha Natesh

ఆ తర్వాతే ప్రమాదం జరగడంతో కెరీర్‌కు బ్రేక్‌ పడింది. ఇప్పుడు నటిగా మళ్లీ కొత్త ప్రయాణం మొదలుపెట్టనుంది.

Image: Instagram/Nabha Natesh

సెల్ఫీ బ్యూటీస్‌

ఒంటికి యోగా మంచిదేగా..!

రష్మీ.. అనసూయ బాటలో కొత్త యాంకర్‌..

Eenadu.net Home