నారా రోహిత్‌ మనసు గెలిచిన శిరీష గురించి తెలుసా?

కథానాయకుడు నారా రోహిత్‌ నిశ్చితార్థం నటి శిరీష లెల్లతో ఈ నెల 13న వేడుకగా జరిగింది. నారా వారింటికి కోడ‌లిగా వెళ్లబోతున్న ఆమె గురించి కొన్ని విషయాలు..

నారా రోహిత్‌ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు శిరీష. చిత్రీకరణ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. ఇరుకుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు.

నటన మీద ఆసక్తితో ఇండియాకు తిరిగి వచ్చి.. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో ‘ప్రతినిధి 2’ఆడిషన్స్‌కి వెళ్లి హీరోయిన్‌గా ఎంపికయ్యారు.

అన్నట్టు సిరీ లెల్ల మన తెలుగమ్మాయే. ఆమె అసలు పేరు శిరీష. గురజాల మండలం దైద ఈమె స్వస్థలం. అనుకోని కారణాల వల్ల సిరి ఫ్యామిలీ ముప్పై ఏళ్ల క్రితం రెంటచింతలకి వలస వచ్చారు. స్థానికంగా బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసింది. మాస్టర్స్ ను ఆస్ట్రేలియాలో పూర్తి చేసింది. 

శిరీష తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆమెకు ముగ్గురు అక్కలు. హైద‌రాబాద్‌లోని పెద్దక్క ప్రియాంక వ‌ద్ద ఉంటూ సినిమా అవ‌కాశాల కోసం ప్రయత్నించారు.

శిరీష నేచర్‌ లవర్‌.. ‘రాత్రివేళల్లో సముద్రపు అలలతో ఆడుకుంటూ చిన్నపిల్లలా మారిపోతా, బీచ్‌లోనే ఎక్కువ సమయాన్ని గడిపేస్తా’ అంటోంది.

ప్రకృతిని ఆస్వాదించడమే కాదు.. వాటిని తన కెమెరాలో బంధిస్తుంటుంది కూడా. వాటిని సోషల్‌ మీడియాలో ఇష్టంగా షేర్‌ చేస్తుంది.

విదేశాలకు టూర్‌లకు వెళితే అక్కడి స్ట్రీట్‌ ఫుడ్‌ తినడం, స్ట్రీట్‌ షాపింగ్‌ చేయడం పక్కాగా ఫాలో అవుతుంది. 

ఫిట్‌నెస్‌ + ఐస్‌క్రీమ్‌ అంటే శిరీషకు బాగా ఇష్టం. ‘ఐస్‌క్రీమ్‌ తిన్నాక జిమ్‌ చేయడానికి అదనపు సమయాన్ని కేటాయిస్తా’ అంటోంది.

ఈ ఏడాది అత్యధికంగా వెతికిన సినిమాలివే!

ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే

కీర్తి.. కల్యాణం.. కమనీయం

Eenadu.net Home