ఇన్నాళ్లూ ‘ఏం చేస్తున్నావ్‌’

నేహా!

‘బ్యాచ్‌’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన నేహా పతన్‌.. ఇప్పుడు ‘ఏం చేస్తున్నావ్‌’తో ప్రేక్షకుల్ని అలరించడానికి వచ్చేసింది.

విజయ్‌ రాజ్‌కుమార్ హీరోగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈటీవీ విన్‌ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఈ బ్యూటీ ఇటీవల షణ్ముఖ్‌ జశ్వంత్‌తో చేసిన వెబ్‌సిరీస్‌ ‘స్టూడెంట్‌’తో సోషల్‌ మీడియాలో మరింత పాపులర్‌ అయింది.

అచ్చ తెలుగు అమ్మాయిలా ఉండే నేహా.. మహారాష్ట్రలోని థానేలో పుట్టింది.

డిగ్రీ పూర్తి చేసిన ఈ భామ మోడల్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది. ‘అఫరన్‌’ అనే టీవి సిరీస్‌తో బుల్లి తెరపై అడుగుపెట్టింది.

మ్యాగీ ప్రకటన ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించింది.

మహారాష్ట్ర జానపద నృత్యం అంటే ఈమెకి ఎంతో ఇష్టం. రీల్స్‌, వీడియోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తూంటుంది.

This browser does not support the video element.

వర్షంలో డ్యాన్స్‌ చేస్తూ, ప్రకృతిని ఆస్వాదించడం బాగా నచ్చుతుందట.

‘డ్రైవింగ్‌ నా హాబీ. తీరిక దొరికితే బైక్‌ డ్రైవ్‌ చేస్తూ అలా ఎంత దూరమైనా.. వెళుతూనే ఉంటాను’ అంటోంది నేహా.  

ఈమె సోషల్‌ మీడియాలో యాక్టివ్‌. చీరల్లో పోజులిస్తూ యువత మనసులు దోచేస్తుంటుంది.

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

మలయాళీ బ్యూటీస్‌.. తెరపై క్యూట్‌నెస్‌

Eenadu.net Home